విజయ్ దేవరకొండ ఫైటర్ మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్యా పాండే.ఈ అమ్మడు ఇప్పటికే బాలీవుడ్ కొన్ని సినిమాలు చేసి తనకంటూ గుర్తింపు సొంతం చేసుకుంది.ప్రస్తుతం ఫైటర్ మూవీలో దేవరకొండతో ఆడిపాడనుంది.ఇదిలా ఉంటే ఈ భామకి ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్స్ ఎదురవుతున్నాయని తన ఆవేదనని వ్యక్తం చేసింది.
నిజానికి సెలబ్రెటీలు సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి దగ్గరగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు.అలాగే ఇన్స్టాగ్రామ్ ద్వారా వారికి సంబందించిన విశేషాలు పంచుకుంటూ ఉంటారు.అప్పుడప్పుడు ఫోటోషూట్ లు పెడుతూ వినోదాన్ని అందిస్తారు.అయితే సోషల్ మీడియాలో కొంత మంది నెటిజన్లు అదే పనిగా ఎవరో ఒకరిని టార్గెట్ చేయడం, విమర్శించడం, నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలాంటి డ్రెస్సు వేయాలి అంటూ ఉచిత సలహాలు ఇవ్వడంతో పాటు, ఎవరైనా కాస్తా గ్లామర్ కాస్ట్యూమ్స్ తో కనిపిస్తే ఇష్టం వచ్చినట్లు బూతులు తిడతారు.
అలాగే వారిని ట్రోల్ చేస్తూ ఉంటారు.
ఈ సమస్య హీరోయిన్లు అందరికి ఉంది.
ఫ్యాన్స్ ముసుగులో కొంత మంది వారిని డీమోటివేట్ చేయడమే పనిగా పెట్టుకుంటారు.ఇష్టానుసారంగా విమర్శలు చేస్తూ ఉంటారు.
అయితే చాలా మంది అలాంటి అతి చేసే వాళ్ళని పట్టించుకోకుండా వదిలేస్తారు.అయితే ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి వేధిస్తూ ఉంటారు.
ఇలాంటి వేధింపులపై అనన్యా పాండే తాజగా రియాక్ట్ అయ్యింది.తను ధరించే దుస్తుల మీద ఆమె అనేక విమర్శలను ఎదుర్కొన్నా తనకు ఏది సౌకర్యంగా అనిపిస్తే వాటినే ధరిస్తా కెరీర్ ప్రారంభంలో అందరికీ సంతోషాన్నిచ్చే దుస్తులు ధరించాను.
కానీ ఇప్పుడు నాకు ఆనందాన్నిచ్చే డ్రెస్సులే వేసుకుంటున్నా.నేను ఎలాంటి బట్టలు వేసుకున్న ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు.
అందుకే దాన్ని పట్టించుకోవడం మానేశా అని చెప్పుకొచ్చింది.