టాలెంట్ ఉన్న నటీనటులకు, టెక్నీషియన్లకు ఛాన్సులు ఇవ్వడంలో అల్లుఅర్జున్ ముందువరసలో ఉంటారు.కెరీర్ ప్రారంభంలో తన సినిమాల ద్వారా ఎంతోమంది కొత్త హీరోయిన్లకు, దర్శకులకు అల్లు అర్జున్ ఛాన్స్ ఇచ్చారు.
తాజాగా ఒక తెలుగమ్మాయికి కూడా ఛాన్స్ ఇస్తానని అల్లు అర్జున్ మాట ఇచ్చాడని పుష్ప సినిమాలో కాకపోయినా భవిష్యత్తులో నటించబోయే సినిమాలో ఆ హీరోయిన్ ను హీరోయిన్ గా నైనా లేక మరో ప్రత్యేక పాత్రకు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
పదుల సంఖ్యలో షార్ట్ ఫిలిమ్స్ లో నటించి సినిమాల్లోకి రాకముందే తనకంటూ యువతలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చాందినీ చౌదరికి అల్లు అర్జున్ ఛాన్స్ ఇస్తానని మాటిచ్చారని సమాచారం.
చాందినీ చౌదరి చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించినా ఆ సినిమాలు సక్సెస్ కాకపోవడంతో టాలెంట్ ఉన్నా చాందినికి పేరు రాలేదు.అయితే కలర్ ఫోటో సినిమా మాత్రం ఆమెకు మంచిపేరు తెచ్చిపెట్టింది.
ఎంతోమంది స్టార్స్ సోషల్ మీడియా వేదికగా చాందిని చౌదరిని ప్రశంసించారు.అయితే స్టార్ హీరోల సినిమాల్లో అవకాశం దక్కితే చాందిని కెరీర్ కు కూడా ప్లస్ అవుతుంది.
అల్లు అరవింద్ కు చెందిన ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో విడుదలైన ఈ సినిమాను చూసి సినిమా యూనిట్ ను, హీరోయిన్ గా నటించిన చాందిని నటనను అల్లు అర్జున్ ప్రశంసించారు.అనంతరం హీరోయిన్ గా అని చెప్పకపోయినా తన సినిమాలో ఛాన్స్ ఇస్తానని మాట అయితే ఇచ్చారు.
అల్లు అర్జున్ సినిమాలో ఛాన్స్ అంటే చిన్న పాత్ర అయినా గుర్తింపు దక్కే అవకాశం ఉంది.కలర్ ఫోటో సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన చాందిని మరో రెండు మూడు హిట్లు తన ఖాతాలో వేసుకుంటే మాత్రం స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.