తెలుగు సినీ పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ గురించి పెద్దగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఇటీవలే టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ముగ్గురు అభిమానులు ఆయన బ్యానర్లను కడుతూ ప్రమాదానికి గురై కింద పడి మృతిచెందిన ఘటన అందరికీ తెలిసిందే.
దీంతో పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు.
అయితే మెగా హీరోలైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మరియు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరూ కలిపి మృతుల కుటుంబాలకు దాదాపుగా 12 లక్షల రూపాయలు సహాయార్థం అందించారు.
అంతేగాక మరింత మంది సినీ నిర్మాతలు కూడా మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తూ చేతనైనంత సహాయాన్ని అందించారు.దీంతో తాజాగా పవన్ కళ్యాణ్ తన అభిమానుల మృతుల కుటుంబాలకు రామ్ చరణ్ తేజ్ మరియు అల్లు అర్జున్ తదితరులకు తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ధన్యవాదాలు తెలిపాడు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ దాదాపుగా మూడు సంవత్సరాల గ్యాప్ తరువాత తెలుగులో వకీల్ సాబ్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రంలో పవర్ కళ్యాణ్ న్యాయం కోసం పోరాటం చేసేటువంటి ఓ లాయర్ పాత్రలో కనిపించనున్నాడు.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి నటువంటి ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు లిరికల్ పాటని విడుదల చేయగా మంచి రెస్పాన్స్ లభించింది.