ప్రస్తుతం మహారాష్ట్రలో కంగనారనౌత్ వర్సెస్ శివసేన మధ్య మిని యుద్ధం జరుగుతుంది.ఇలాంటి టైంలో కంగనారనౌత్ తండ్రి జై రామ్ ఠాకూర్ వేధింపులకు గురి అవుతున్న తన కూతురుకి భద్రత కల్పించాలని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.
ఆ అభ్యర్థనను
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కేంద్రానికి సిఫార్సు చేశారు.ఆ సిఫార్సు మేరే కేంద్రం కంగనా రనౌత్‌కు వై-ప్లస్ సెక్యూరిటీ భద్రత కల్పించినట్లు కేంద్ర సహాయ హోంమంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు.ఇక ముంబైలో జరుగుతున్న కొన్ని అరాచకాలపై,సామాజిక సమస్యలపై కంగనా స్పందిస్తుండడం అక్కడ కొందరి గుండెలలో మంటను రగిలిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే ఆమె భద్రత కోసం ఎవరు ఖర్చు చేస్తారన్న అంశంపై మాత్రం ఆయన సమాధానం చెప్పలేదు.దానితో మహారాష్ట్ర శివసేన,కాంగ్రెస్ పార్టీల నేతలు ముందునుండి ఆరోపిస్తున్నట్లు కంగనాకు బిజేపి మద్దతు ఇస్తుందన్న రూమర్ కు బలం చేకూరింది.
ఇక ముంబైలో శ్రుతి మించుతున్న శివసేన వర్సెస్ కంగనా ఫైట్ ఎలా ఎండ్ అవుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.