జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్లేస్ ని భర్తీ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తుంది.అందుకు తగ్గట్టుగా కాంగ్రెస్ బలహీనపడ్డ రాష్ట్రాలలో పాగా వేయాలని తీవ్రంగా శ్రమిస్తుంది.
ఇలాంటి టైంలో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కేంద్ర ప్రభుత్వం పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అవేంటో ఇప్పుడు చూద్దాం.
కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థ, సరిహద్దులలో చైనాతో ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో వీటి నుండి ప్రజల ఆటెన్షన్ ను డైవర్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం,కొన్ని మీడియా మాధ్యమాలతో కలిసి సుశాంత్ సింగ్ కేసును వాడుకుంటుందని ఆయన ఆరోపించారు.
ప్రస్తుతం భారత దేశం ఎన్నో క్లిష్ట సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో బాలీవుడ్ నటి రియా మరియు ఆమె కుటుంబ సభ్యులను దోషులుగా చూపడానికి కేంద్రం,కొన్ని మీడియా సంస్థలు ప్రయత్నించడం వింతగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.అంతేకాకుండా చైనా ఆక్రమించుకున్న మన భూభాగాలను విడిచి పెట్టేసింది, మన దేశ ఆర్థిక వ్యవస్థ ఐదు ట్రిలియన్లు కు చేరింది,స్వచ్ భారత్, డిజిటల్ స్కిల్ ఇండియా విజయవంతమయ్యాయి, యువతకి కోట్లల్లో ఉద్యోగాలు వచ్చాయి.
ఇక మన దేశంలో మిగిలింది కేవలం రియా చక్రబర్తి, ఆమె కుటుంబం అరెస్టు మాత్రమే కాదా! అంటూ వ్యంగ్రాస్తాలు సంధించారు.