కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎలా నాశనం చేసిందో.చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
రోజు రోజుకు కరోనా కేసులు దారుణంగా పెరుగుతున్నాయి.కరోనా వ్యాక్సిన్ సంగతి పక్కన పెడితే కరోనా రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా జనాలు పాటించడం లేదు.
మాస్కు ధరించు, శానిటైజేర్ ఉపయోగించు, సోషల్ డిస్టెన్స్ పాటించు అని చెప్పిన ఆ జనాలు వినడం లేదు.
ఇక ఈ నేపథ్యంలోనే ఇండోనేషియాలో కరోనా తీవ్రత దారుణంగా ఉండడంతో అక్కడ కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు.
బయటకు వస్తే మాస్కు తప్పనిసరిగా ఉపయోగించాలి అని చిలకకు చెప్పినట్టు అధికారులు చెప్పారు.కానీ వినడం లేదు.దీంతో మాస్కు లేకుండా బయటకు వస్తే వెరైటీ శిక్షలను విధిస్తున్నారు.
ఇక ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి మాస్కు లేకుండా రోడ్డు మీదకు వచ్చాడు.
మరణించక ముందే ఆ వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించారు.పూర్తి వివరాల్లోకి వెళ్తే.మాస్కు లేకుండా వచ్చిన వ్యక్తిని శవపేటికలో పడుకోబెట్టి ఊరేగించారు.కరోనా తీవ్రత అధికంగా ఉందని, మాస్క్ పెట్టుకోకపోతే మనిషిని కరోనా ఇలా చంపేస్తుందని చెప్తూ ఆ వ్యక్తిని ఊరేగించారు.
కాగా ఇండోనేషియాలో కరోనా జాతి చాలా కఠినమైనది.అందుకే అక్కడ నిబంధనలను మరింత కఠినంగా మార్చేశారు.