ఇంట్లో ఏమి సంపాదించకుండా.ఏదైనా అనవసరం ఖర్చు చేస్తే.
డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా ? అని డైలాగ్ వేస్తారు.కానీ ఈ ఘటన చూస్తే అనిపిస్తుంది.
డబ్బులు నిజంగానే చెట్లకు కాస్తున్నాయి అని.ఈ ఒక్క చెట్టు ఉంటే చాలు ఇంటిల్లిపాది లక్షాధికారులు అయిపోతారు.ఎలా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ ఘటన గురించి తెలుసుకోవాల్సిందే.
న్యూజిలాండ్‌కు చెందిన ఓ అజ్ఞాత వ్యక్తి ప్రత్యేకమైన రంగు ఉండే అరుదైన జాతి ఫిలోడెండ్రాన్ మినిమా మొక్కను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4 లక్షల రూపాయిలు పెట్టి కొన్నాడు.
ఈ మొక్కను ”ట్రేడ్ మి” అనే ఈ కామర్స్ వెబ్‌సైట్ వేలానికి ఉంచింది.దీంతో ఆ మొక్కను కొనేందుకు ఎంతోమంది ఆసక్తి కనబరిచారు అయితే ఓ వ్యక్తి ఏకంగా మొక్కకు నాలుగు లక్షల రూపాయలు పెట్టి కొన్నాడు.
అనంతరం ఆ వ్యక్తి మొక్క ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇది నాలుగు లక్షలకు కొన్నట్టు ఆ వ్యక్తి చెప్పాడు.నాలుగు ఆకులు అద్భుతమైన పసుపు రంగులో ఆకర్షణీయంగా ఉన్నాయంటూ సంతోషాన్ని వ్యక్తపరిచారు.
అయితే ఈ మొక్కను చుసిన నెటిజన్లు నాలుగు ఆకులకు నాలుగు లక్షల రూపాయిలా అంటూ నెటిజన్లు అవాక్కయ్యారు.