నాని ‘వి’ సెప్టెంబర్ 5న కాదు.. ఎప్పుడో తెలుసా?

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వి’ ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఈ సినిమాతో మరోసారి నాని తన మ్యాజిక్‌ను క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యాడు.

 Nani V Movie Release Time Changed, Nani, V Movie, Sudheer Babu, Mohan Krishna In-TeluguStop.com

కాగా ఈ సినిమాను దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి తనదైన మార్క్‌తో తెరకెక్కించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.

కానీ లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు మూతపడటంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు.సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల ప్రకటించింది.

కాగా ఈ సినిమా అనుకున్న సమయానికంటే ముందే అమెజాన్ ప్రైమ్‌లో ప్రత్యక్షం కానున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాను సెప్టెంబర్ 4న రాత్రి 9.30 గంటలకే స్ట్రీమింగ్ చేసేందుకు అమెజాన్ ప్రైమ్ రెడీ అవుతోందట.అంటే చెప్పిన టైం కంటే ముందే ఈ సినిమా మనం చూసేందుకు వీలుంటుంది.

పూర్తి క్రైమ్ థ్రిల్లర్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో నాని సీరియల్ కిల్లర్‌గా కనిపిస్తుండగా, ఆయన్ను పట్టుకునే పోలీస్ ఆఫీసర్ పాత్రలో యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో అందాల భామలు నివేదా థామస్, అదితిరావు హైదరీలు నటిస్తున్నారు.

స్టార్ప ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.ఇక ‘వి’ చిత్రం ఎలాంటి రిజల్ట్‌ను సాధిస్తుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube