నాని ‘వి’ సెప్టెంబర్ 5న కాదు.. ఎప్పుడో తెలుసా?

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వి’ ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.

ఈ సినిమాతో మరోసారి నాని తన మ్యాజిక్‌ను క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యాడు.

కాగా ఈ సినిమాను దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి తనదైన మార్క్‌తో తెరకెక్కించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.కానీ లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు మూతపడటంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు.

సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల ప్రకటించింది.

కాగా ఈ సినిమా అనుకున్న సమయానికంటే ముందే అమెజాన్ ప్రైమ్‌లో ప్రత్యక్షం కానున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను సెప్టెంబర్ 4న రాత్రి 9.30 గంటలకే స్ట్రీమింగ్ చేసేందుకు అమెజాన్ ప్రైమ్ రెడీ అవుతోందట.

అంటే చెప్పిన టైం కంటే ముందే ఈ సినిమా మనం చూసేందుకు వీలుంటుంది.

పూర్తి క్రైమ్ థ్రిల్లర్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో నాని సీరియల్ కిల్లర్‌గా కనిపిస్తుండగా, ఆయన్ను పట్టుకునే పోలీస్ ఆఫీసర్ పాత్రలో యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో అందాల భామలు నివేదా థామస్, అదితిరావు హైదరీలు నటిస్తున్నారు.

స్టార్ప ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ఇక ‘వి’ చిత్రం ఎలాంటి రిజల్ట్‌ను సాధిస్తుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.

మనుషులను అంచనా వేయడంలోనూ వేణుస్వామి తోపు.. బిగ్‌బాస్ నెక్స్ట్ సీజన్ గెలిచేస్తారా..?