జైలు జీవితం ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.జైలు జీవితాన్ని సామాన్యులు అనుభవించాలంటేనే ఎంతో కుమిలిపోతారు.
అలాంటిది పేరు మోసిన హీరోయిన్లు, హీరోలు మొయ్యాలి అంటే ఎంత దారుణంగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు.అనుకోని పరిస్థితుల్లో అలా జైలు జీవితం అనుభవించిన హీరోయిన్లు ఎవరు అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.
స్నేహలత రెడ్డి(Sneha Latha Reddy):
ప్రముఖ నర్తకిగా, నటిగా, దర్శకురాలిగా ఎన్నో ప్రశంసలందుకున్న స్నేహలత రెడ్డి ఎమర్జెన్సీని తీవ్రంగా వ్యతిరేకించారు.ఆ సమయంలో ఆమెను అరెస్ట్ చేసి జైల్లో చిత్ర హింసలకు గురి చేశారు.అప్పట్లోనే ఆమె జైల్లో అనుభవించిన జీవితాన్ని ” ఏ ప్రిజన్ డైరీ” అనే పుస్తకాన్ని రాశారు.
మౌనిక బేడీ(Mounica Bedy) :
అండర్ వరల్డ్ డాన్ ని ప్రేమించిన ఈ హీరోయిన్ ఎంతో టార్చర్ అనుభవించింది.ఎన్నో బాధలను చూసింది.అక్కడ కష్టాలు తట్టుకోలేక పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులకు చిక్కి అరెస్ట్ అయ్యింది.రెండేళ్ల పాటు జైలు జీవితం అనుభవించిన ఈ నటి.ఒకానొక సమయంలో స్టార్ డాం అనుభవించిన నేను జైలులో బాత్ రూమ్ పక్కన పడుకోవాల్సి వచ్చిందని ఆమె జీవిత కథలో రాసింది.
శ్వేతా బసు(Swetha Basu) :
బాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి టాలీవుడ్ లో హీరోయిన్ గా ఓ రేంజ్ లో అనుభవించిన ఈ నటి రెండు నెలల పాటు జైలు జీవితం గడిపింది.ప్రాస్టిట్యూషన్ కేసులో బుక్ అయ్యి ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపింది.
ఇప్పటికి ఆ రోజులను తలుచుకొని నిద్రలో కూడా ఉలిక్కిపడి లేస్తానంటూ ఆమె ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.
ఇలా సోనాలి బింద్రే(Sonali), మధు బాలా(Madhu Bala) కూడా వివిధ కారణాల వల్ల జైలుకు వెళ్లిన రోజులు ఉన్నాయ్.