ఈ కాలంలో పెళ్లికి ముందే ప్రెగ్నన్సీ అవ్వడం కామన్ అయ్యింది.మొన్నటికి మొన్న హార్దిక్ పాండ్య కూడా పెళ్లికి ముందే తండ్రి అయ్యాడు.
ఇది సినిమా స్టార్స్ విషయంలో అయితే మరి ఎక్కువ.ఇప్పుడు అదే ట్రెండ్ మారి ఇలా పెళ్లికి ముందే పిల్లలను కంటున్నారు.
కానీ ఒకప్పుడే కొందరు స్టార్ హీరోయిన్లు పెళ్లికి ముందే తల్లులు అయ్యారు.వారు ఎవరు అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.
శ్రీదేవి(Sridevi):
అందాల తార.ఈమెను పెళ్లి చేసుకునేందుకు అప్పట్లో ఎంతోమంది పోటీపడ్డారు.అందులో రామ్ గోపాల్ వర్మ కూడా ఒక్కడు.అంతమంది పోటీపడిన అప్పటికే పెళ్లి అయినా బాలీవుడ్ బడా నిర్మాత బోనికపూర్ నే శ్రీదేవి రెండో పెళ్లి చేసుకుంది.వారు పెళ్లి చేసుకున్నప్పటికి శ్రీదేవి ఏడు నెలల గర్భవతి.
సారిక(Sarika):
కమల్ హాసన్ ఎంత పెద్ద స్టార్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఏ పాత్ర అయినా సరే అద్భుతంగా నటించి తన సత్తా ఏంటో చూపించుకున్నాడు.అలాంటి విలక్షణ నటుడు వల్ల బాలీవుడ్ నటి సారిక పెళ్లికి ముందే తల్లి అయ్యింది.వారి ఇద్దరి ప్రేమకు పుట్టిన బిడ్డే శృతి హాసన్.
రేణుదేశాయ్(Renu Desai):
రేణు దేశాయ్ టాలీవుడ్ లో ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్.ఈ హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడు పవన్ కళ్యాణ్.మొదట లివింగ్ రిలేషన్ లో ఉన్నారు.ఆ సమయంలో వీరిద్దరికి ఒక బిడ్డ కూడా పుట్టాడు.అనంతరం కొన్ని అనివార్య కారణాల వల్ల రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు.