భారతీయ దంపతులు ఇద్దరికి సింగపూర్ న్యాయస్థానం 21 నెలలు జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది.అంతేకాదు 5,500 సింగపూర్ డాలర్లు నష్టపరిహారం కూడా విధించింది.
ఇంతకీ వాళ్ళు చేసిన పని ఏమిటంటే.సింగపూర్ లో ఎన్నో ఏళ్ళుగా ఫరా, మహ్మద్ అనే ఇద్దరు భారతీయ దంపతులు ఉంటున్నారు.
వారి ఇంట్లో పని చేయడానికి భారతీయ మహిళని పనికి పెట్టుకున్నారు.కొన్ని రోజులు బాగానే గడిచినా తరువాత నుంచీ ఆ మహిళకి ఇద్దరు దంపతులు చుక్కలు చూపించడం మొదలు పెట్టారు.
రోజుకో రకంగా టార్చర్ చేస్తూ శారీరకంగా, మానసికంగా ఆమెని హింసించే వాళ్ళు.ప్రతీ రోజు ఆ దంపతులు పెట్టే బాధలు భరించలేని ఆమె మానసికంగా ఎంతో కుంగిపోయింది.
సాటి భారతీయురాలు అని చూడకుండా వాళ్ళు చూపించే నరకాన్ని భరిస్తూ వచ్చింది.రోజు రోజుకి వారి టార్చర్ ఎక్కువై పోవడంతో చేసేది లేక పోలీసు కేసు పెట్టి కోర్టుని ఆశ్రయించింది.
ఈ కేసుపై విచారణ ప్రారంభించిన పోలీసులు తమదైన శైలిలో వివరాలు సేకరించి పక్కా ఆధారాలను సేకరించి న్యాయమూర్తి ముందు ఉంచారు.
సాక్ష్యాదారాలను పరిశీలించిన న్యాయమూర్తి ఆమె మానసికంగా, శారీరకంగా కుంగిపోయిందని నిర్ధారించారు.
దాంతో కోర్టు దంపతులకి రెండు రకాల శిక్షలు విధిస్తూ తీర్పు చెప్పింది.ఫరా కి 21 నెలలు జైలు శిక్ష విధించగా మహ్మద్ కి నాలుగు నెలలు శిక్ష విధించింది.
అంతేకాదు దంపతులు ఇద్దరు ఆమెకి 5500 సింగపూర్ డాలర్లు నష్టపరిహారం చెల్లించాలని తీర్పు చెప్పింది.
.