నేటి కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక జుట్టు సమస్యతో బాధపడుతుంటారు.జుట్టు రాలడం, పొడి జుట్టు, చండ్రు, వెంట్రుకలు చిట్లిపోవడం ఇలా ఎన్నో జుట్టు సమస్యలు వేధిస్తుంటాయి.
అయితే అందరిలోనూ కామన్‌గా ఉండేది జుట్టు రాలడం.ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఎన్ని చిట్కాలు పాటించినా.
ఫలితం లేక చింతిస్తుంటారు.అయితే నిమ్మరసం జుట్టు రాలే సమస్యకు సమర్థవంతంగా చెక్ పెట్టడంతో పాటు.
వెంట్రుకలు ఒత్తుగా ఎదిగేలా కూడా చేస్తుంది.
మరి నిమ్మను జుట్టుకు ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా నిమ్మరసం తీసుకుని.అందులో కొబ్బరి నూనె మిక్స్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి.అరగంట తర్వాత తలస్నానం చేయాలి.
ఇలా వారినికి రెండు సార్లు చేయడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గి.ఒత్తుగా పెరుగుతుంది.
అలాగే చుండ్రు సమస్యతో బాధపడేవారు నిమ్మరసంను తలకు పట్టించాలి.అరగంట పాటు ఆరనిచ్చి.అనంతరం తలస్నానం చేయాలి.ఇలా వారినికి ఒకసారి చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గి.జుట్టు ఆరోగ్యంగా మారుతుంది.ఇక నిమ్మరసంలో పెరుగు కలిపి.
తలకు అప్లై చేసి బాగా మసాజ్ చేయాలి.అనంతరం తలస్నానం చేయాలి.
పెరుగు, నిమ్మ రెండూ.జుట్టుకు అవసరమైన పోషకాలను అందిస్తుంది.మరియు జుట్టు బాగా పెరగడానికి సహాయపడుతుంది.అలాగే వేపాకులను పేస్ట్ చేసి.
అందులో నిమ్మరసం మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి.
ఆరిన తర్వాత తలస్నానం చేయాలి.ఇలా చేయడం వల్ల కూడా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.