ముంబయి క్లబ్ క్రికెటర్ కరణ్ తివారి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.గత కొన్ని రోజులుగా ఐపీఎల్‌లో ఆడేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న ఈయనకు ఛాన్స్ కలిసి రాలేదు.
ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో కూడా కరణ్ తివారికి ఛాన్స్ ఇవ్వలేదు.దాంతో తీవ్ర మనస్థాపంకు గురైన కర్ తివారి తనువు చాలించాలనుకున్నాడు.
తన గదిలో గత రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన ట్రాక్ రికార్డును మరియు కాల్ రికార్డును పరిశీలించగా సహజ ఆత్మహత్యగా ప్రాధమిక నిర్థారణకు వచ్చారు.
పోలీసులు మరియు కరణ్ తివారి సన్నిహితుల కథనం ప్రకారం.ముంబయి మలాద్‌కు చెందిన కరణ్ బౌలింగ్ లో మంచి ప్రతిభ కనబర్చేవాడు.దక్షిణాఫ్రికా బౌలర్ స్టెయిన్‌లా బౌలింగ్ చేస్తూ ఉండటంతో అతడికి స్థానికంగా జూనియర్ స్టెయిన్ అంటూ పేరు వచ్చింది.ముంబయి ఇండియన్స్ బ్యాట్స్‌మన్ నెట్ ప్రాక్టీస్‌కు కరణ్ బౌలింగ్ వేసేవాడు.
ఐపీఎల్‌లో ఆడాలనేది తన కలగా చెబుతూ ఉండేవాడట.అయితే ఐపీఎల్‌లో ఆడాలంటే ఖచ్చితంగా ఏదో ఒక రాష్ట్రంకు రంజీ మ్యాచ్ ఆడాల్సి ఉంది.
కరణ్ కు ఆ ఛాన్స్ ఎప్పుడు రాలేదు.దాంతో ఐపీఎల్ వేలంలో అతడి పేరును చేర్చలేదని బీసీసీఐ వర్గాల వారు అంటున్నారు.