విజృంభిస్తున్న కరోనా,వరుసగా మూడో రోజు కూడా 60వేలకు పైగా....

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 60 వేలకు పైగా నమోదు అయ్యాయి.

 Corona Cases Raises In India, Coronavirus, Corona Effect, India-TeluguStop.com

వారం రోజుల క్రితం ఈ సంఖ్య 50 వేలకు పైగా ఉండగా ఇప్పుడు ఈ సంఖ్య 60 కు చేరుకుంది.గత మూడు రోజులుగా దేశవ్యాప్తంగా నమోదు అవుతున్న కరోనా కేసుల సంఖ్య 60 వేలకు పైగానే నమోదు అవుతున్నాయి.

ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ కరోనా మహమ్మారి భారత్ లో ఇప్పుడు ఉగ్రరూపం దాల్చింది.వరుసగా నమోదు అవుతున్న కేసుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21 లక్షలకు పైగా నమోదు కాగా,గడచిన 24 గంటల్లో 8 వందలకు పైగా మృతుల సంఖ్య నమోదు కావడం తో ఈ సంఖ్య 43 వేలకు పైగా నమోదు అయ్యింది.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం గత మూడు రోజులుగా 60 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయినట్లు తెలుస్తుంది.మహారాష్ట్ర,తమిళనాడు,ఢిల్లీ,ఏపీ,కర్ణాటక రాష్ట్రాల్లో అత్యధికంగా ఈ కరోనా కేసులు నమోదు అవుతుండగా, దేశరాజధాని ఢిల్లీ లో కూడా కేసులు మరోసారి పెరుగుతున్నట్లు తెలుస్తుంది.

అయితే దేశవ్యాప్తంగా భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండగా,మరోపక్క రికవరీ రేటు కూడా బాగానే ఉండడం ఊరట నిస్తుంది.ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 68 శాతం కు పైగా ఉండగా,మరణాల రేటు 2.01 శాతంగా నమోదు అయినట్లు తెలుస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నప్పటికీ దేశవ్యాప్తంగా కేసులు మాత్రం నియంత్రించలేకపోతున్నారు.

ఈ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube