తమిళనాడు గవర్నర్‎కు కరోనా పాజిటివ్..!

కరోనా మహమ్మారి సామాన్య ప్రజలతో పాటు ప్రముఖులను కూడా వణికిస్తోంది.తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, ఇప్పుడు తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‎కు కరోనా పాజటివ్ అని తేలింది.

 Tamilnadu Governer Bhanvarilal Purohit, Corona Positive, Raj Bhavan, Tamil Nadu,-TeluguStop.com

దీంతో చికిత్స నిమిత్తం గవర్నర్ భన్వరీలాల్ చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చేరారు.ప్రస్తుతం గవర్నర్ కు కరోనా లక్షణాలు లేవని.

, ఆరోగ్యం నిలకడగానే ఉందని చెన్నై కావేరీ ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అరవిందన్ సెల్వరాజ్ వెల్లడించారు.

కాగా, కొద్ది రోజుల కిందట తమిళనాడు రాజ్ భవన్‎లో కరోనా కలకలం రేగిన సంగతి తెలిసిందే.

రాజ్ భవన్‎లో పనిచేసే సిబ్బందిలో 84 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది.కానీ అప్పుడు గవర్నర్ భన్వరీలాల్ కు పరీక్షలు నిర్వహించగా, నెగిటివ్ వచ్చినట్టు రాజ్ భవన్ అధికారులు వెల్లడించారు.

అయితే ముందు జాగ్రత్తగా గవర్నర్ భన్వరీలాల్ జూలై 29 నుంచి హోం క్వారంటైన్ లో ఉంటున్నారు.ఆదివారం నిర్వహించిన పరీక్షల్లో గవర్నర్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

దీంతో ఆయన కావేరీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.

ఇక తమిళనాడు రాష్ట్రంలో ఆదివారం రికార్డు స్ధాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో కొత్తగా 5,875 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,57,613కు చేరింది.ఆదివారం ఒక్కరోజే 98 కరోనా మరణాలు సంభవించగా, రాష్ట్రవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 4,132 కు చేరింది.

ఇప్పటివరకు 1,96,483 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు అధికారులు వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube