అప్పట్లో ప్రముఖ తెలుగు ఎంటర్టైన్మెంట్ చానల్ అయినటువంటి జీ తెలుగులో ప్రసారమయ్యే “కొంచెం ఇష్టం కొంచెం కష్టం” అనే సీరియల్ ద్వారా బుల్లితెర పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమై అలాగే సినిమా పరిశ్రమలో కూడా పలు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇటువంటి నటి హిమజా గురించి ప్రేక్షకులకి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈమధ్య కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఈ అమ్మడు ప్రస్తుతం ఇంటి పట్టునే ఖాళీగా ఉంటోంది.
దీంతో ఇటీవలే బైక్ రైడింగ్ కూడా నేర్చుకుంది.తాజాగా హిమజా రాయల్ ఎన్ ఫీల్డ్ ద్విచక్ర వాహన సంస్థకు చెందిన థండర్ బర్డ్ బైక్ ని నడుపుతూ వీడియోని తీసి తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.
దీంతో కొందరు నెటిజన్లు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పై బిగ్ బాస్ బ్యూటీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.మరికొందరు మాత్రం బెంజ్ కారు ఉండగా బైక్ ఎందుకు కొన్నావు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
అయితే హిమాజా మాత్రం తను మోటార్ సైకిల్ కొన్న విషయంపై మాత్రం స్పందించడం లేదు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ అమ్మడు గత ఏడాది బిగ్ బాస్ మూడో సీజన్లో కంటెస్టెంట్ గా పాల్గొని బాగానే పాపులర్ అయింది.
అంతేగాక పలు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించే అవకాశాలను కూడా దక్కించుకుంది.ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో ప్రాధాన్యం ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.