తెలుగులో ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వం వహించిన “నరసింహుడు” అనే చిత్రంలో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన చిందులేసి తెలుగు ప్రేక్షకులని బాగానే అలరించిన బాలీవుడ్ బ్యూటీ సమీరా రెడ్డి గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియనివారుండరు.
అయితే మొదటగా సమీరా రెడ్డి బాలీవుడ్ చిత్రాలలో నటించినప్పటికీ తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది.అయితే సమీరా రెడ్డి హీరోయిన్ గానే కాకుండా పలు చిత్రాలలో స్పెషల్ పాటలలో కూడా నటించి విమర్శకుల నుంచి మంచి మార్కులే అందుకుంది.
అయితే చేతి నిండా అవకాశాలతో కెరియర్ సాఫీగా సాగుతున్న సమయంలో 2014 వ సంవత్సరంలో ముంబైకి చెందినటువంటి ప్రముఖ ఎంటర్ ప్రీనర్ అక్షయ్ వార్దే ను పెళ్లి చేసుకుంది.పెళ్లి చేసుకున్న తర్వాత సమీరారెడ్డి సినిమా పరిశ్రమ వైపు అసలు తిరిగి చూడడం లేదు.
కాగా ప్రస్తుతం సమీరా రెడ్డికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.దీంతో సమీరా రెడ్డి ఒక పక్క పిల్లల ఆలనా పాలనా చూస్తూ కుటుంబ బాధ్యతలను చక్కబెడుతూనే మరోపక్క వ్యాపారంలో తన భర్తకి అండగా నిలుస్తోంది.
అయితే ఇటీవలే సమీరా రెడ్డికి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టేందుకు పలు సినీ అవకాశాలు తలుపు తట్టినా ఆమె సున్నితంగా వాటిని తిరస్కరించినట్లు సమాచారం.దీన్ని బట్టి చూస్తుంటే సమీరారెడ్డి మళ్లీ సినిమాల వైపు వచ్చేలా కనబడడం లేదు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా సమీరా రెడ్డి చివరగా తెలుగులో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన కృష్ణం వందే జగద్గురు అనే చిత్రంలో స్పెషల్ పాటలో ఆడి పాడింది.ఆ తర్వాత మళ్లీ ఇప్పటివరకు సమీరారెడ్డి సినిమాలలో మళ్ళీ నటించలేదు.
అయితే సమీరా రెడ్డి తెలుగులో విక్టరీ వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి, తదితర స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.సమీరా రెడ్డి తెలుగు హిందీ తమిళం తదితర భాషలలో దాదాపు 30 కి పైగా చిత్రాలలో నటించింది.
అంతేగాక పలు మెసేజ్ ఓరియెంటెడ్ షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించింది.