ఇకపై తెరకెక్కబోతున్న సినిమాలన్నింటి టార్గెట్‌ అదే

టాలీవుడ్‌లో ప్రతి ఏడాది వందలకొద్ది సినిమాలు చిన్నా పెద్ద సినిమాలు విడుదల అయ్యేవి.కాని ఈ ఏడాది కరోనా కారణంగా ఫిబ్రవరి వరకు విడుదల అయిన సినిమాలే.

 Ott Platform,theaters,corona Effect,tollywood Movies,movies Release In Ott-TeluguStop.com

ఆ తర్వాత థియేటర్లు బంద్‌ ఉండటం వల్ల సినిమాలు విడుదల కాలేదు.ఇక జులై లేదా ఆగస్టులో సినిమాలు మళ్లీ మొదలు అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది.

అందుకు సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది.అయితే ఈ సమయంలో చిన్న సినిమాలు ఎక్కువగా ఓటీటీ రిలీజ్‌కు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది.

ఇకపై తీయబోతున్న సినిమాలు కూడా ఓటీటీని లక్ష్యంగా చేసుకుని తీయాలనే ఉద్దేశ్యంతో మేకర్స్‌ ఉన్నారు.వీలైతే థియేటర్లలో విడుదల చేస్తారు.లేదంటే ఓటీటీలో విడుదల చేస్తారు.ఎలా విడుదల చేసినా నష్టం లేకుండా ఉండేలా మేకర్స్‌ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఒక చిన్న చిత్రాల దర్శక నిర్మాత మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాల బడ్జెట్‌ను సగానికి తగ్గించాము.రెండు మూడు కోట్లతో గతంలో సినిమాలు తెరకెక్కించాం.

కాని ఇప్పుడు రెండు కోట్లలో మూడు సినిమాలను ప్లాన్‌ చేశాము.ఆ మూడు సినిమాలు కూడా థియేటర్లు ఓపెన్‌ అయితే థియేటర్లు లేదంటే ఓటీటీలో విడుదల చేస్తామంటూ పేర్కొన్నాడు.

ఓటీటీలో విడుదల చేయడం వల్ల నిర్మాతలకు మంచి లాభాలే వస్తున్నట్లుగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.మీడియం బడ్జెట్‌ సినిమాలు థియేటర్లలో విడుదల అయితేనే నెగ్గుకు రాగలవు.

కాని కోటి లోపు బడ్జెట్‌ చిత్రాలు ఓటీటీలో విడుదల అయినా కూడా బడ్జెట్‌ను రికవరీ చేయగలవు అంటూ నిర్మాతలు భావిస్తున్నారు.అందుకే ఎక్కువ శాతం సినిమాలు ఓటీటీని దృష్టిలో పెట్టుకుని నిర్మిస్తున్నట్లుగా పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube