క్రాక్ మరో గబ్బర్‌సింగ్ అంటోన్న రవితేజ

మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం క్రాక్ రలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి తనదైన మార్క్ వేసుకునేందుకు మాస్ రాజా రెడీ అవుతున్నాడు.

 Krack Movie To Be Another Gabbar Singh, Krack, Gabbar Singh, Raviteja, Pawan Kal-TeluguStop.com

కాగా ఈ సినిమాతో రవితేజతో కలిసి యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ముచ్చటగా మూడోసారి సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు.ఈ సినిమా తనకు కచ్చితంగా కమ్‌బ్యాక్ మూవీ అవుతుందని రవితేజ ధీమాగా ఉన్నాడు.

ఇక ఈ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు ఈ చిత్రం పోస్టర్స్, టీజర్స్ చూస్తే తెలుస్తోంది.పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో కామెడీకి కొదువే లేదని చిత్ర యూనిట్ అంటోంది.

ఇక ఈ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్‌సింగ్‌ను పోలి ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.పవన్‌కు ఆ సినిమా ఎలాంటి సక్సెస్‌ను అందించిందో, రవితేజకు క్రాక్ కూడా అలాంటి హిట్ అందిస్తుందని వారు అంటున్నారు.

కాగా ఈ సినిమాలో రవితేజ పాత్ర అల్టిమేట్‌గా ఉంటుందని, మాస్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని చిత్ర యూనిట్ అంటోంది.ఇక ఈ సినిమాలో అందాల భామ శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, తమిళ బ్యూటీ వరలక్ష్మీ శరత్ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది.

సముథ్రికరన్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను అతి త్వరలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.మరి ఈ సినిమా గబ్బర్‌సింగ్‌లా మారి విజయాన్ని అందుకుంటుందా లేక డిస్కోరాజాలా ఫ్లాప్‌గా మిగులుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube