ప్రస్తుతం మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ మహిళలపై జరుగుతున్న ఆగడాలు మాత్రం ఆగడం లేదు.తాజాగా రైలు ప్రయాణం చేసి తన ఇంటికి చేరుకోవాలని రైల్వే స్టేషన్ కు వచ్చిన యువతికి ముగ్గురు కేటుగాళ్ళు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి దారుణంగా అత్యాచారం చేసి వదిలిపెట్టిన ఘటన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ నగరంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే జార్ఖండ్ రాష్ట్రానికి చెందినటువంటి ఓ యువతి స్థానిక నగరంలోని ఓ వ్యాపారి ఇంట్లో పని చేస్తోంది.అయితే గత కొద్ది రోజులుగా లాక్ డౌన్ కారణంగా తన స్వగ్రామానికి చేరుకోలేకపోయింది.
తాజాగా వలస కార్మికులు మరియు ఇతర పనుల నిమిత్తమై పట్టణాలకు వచ్చి ఇరుక్కుపోయిన వారిని తరలించేందుకు ప్రభుత్వం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడంతో యువతి కూడా తన స్వగ్రామానికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంది.అయితే ఇందులో భాగంగా రైల్వే స్టేషన్ కి వెళ్ళిన అనంతరం రైలు ఎక్కే విషయంలో సందేహం రావడంతో అటుగా వెళ్తున్న ముగ్గురు యువకుల సహాయం చేయాలని కోరింది.
ఇదే అదునుగా తీసుకున్నటువంటి ఆ ముగ్గురు యువకులు సహాయం చేసే నెపంతో తాను ఎక్కాల్సిన రైలు స్టేషన్ కి రాదని వేరే స్టేషన్ కి వస్తుందని మేము కూడా అక్కడికి వెళ్తున్నామని కావాలంటే తమతో పాటు రావచ్చని కోరారు.వారి మాయ మాటలను నమ్మిన యువతి వెంటనే వారితో పాటు వెళ్ళింది.
ఈ క్రమంలో ముగ్గురు యువకులు యువతిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై దారుణంగా అత్యాచారం చేశారు.అనంతరం ఎవరూ లేని ప్రదేశంలో వదిలిపెట్టి వెళ్లిపోయారు.
అయితే స్పృహ కోల్పోయి ఉండడాన్ని గమనించిన టువంటి స్థానికులు వెంటనే బాధితురాలిని చికిత్స నిమిత్తం దగ్గర ఉన్నటువంటి ఆస్పత్రికి తరలించారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి బాధితురాలు స్పృహలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా ఫిర్యాదు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.