ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం లాక్ డౌన్ విధించిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఇందులో భాగంగా చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి చిత్రీకరణ పనులు మరియు ఇతర పనులను కూడా నిలిపివేశారు.
దీంతో సినీ పరిశ్రమలో పని చేసే ఆర్టిస్టులు ఆదాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అయితే తాజాగా సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు ఈ విషయం గురించి సమావేశమనట్లు సమాచారం.
అయితే ఇందులో భాగంగా చిత్రంలోని ముద్దు సీన్లు, మరియు రొమాన్స్ కి సంబంధించిన సీన్ల గురించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.అంతేకాక చిత్రీకరణ సమయంలో కూడా దర్శక నిర్మాతలు మరియు ఇతర టెక్నీషియన్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారట.
ఇతర దేశాల్లో షూటింగులు జరిపేటప్పుడు కూడా ప్రొడక్షన్ పనులను ఆ దేశ టెక్నీషియన్ల తోనే జరిపించే విధంగా సన్నాహాలు చేస్తున్నారట.అయితే సినిమాలన్న తర్వాత ముద్దు సీన్లు, రొమాన్స్ సన్నివేశాలు ఉండటం కామన్ అయినప్పటికీ కొంతకాలం పాటు వాటికి దూరంగా ఉంటే అలాంటి సన్నివేశాల్లో నటించే నటీనటులకు మంచిదని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే మరోమారు ఈ విషయంపై కూడా సమావేశమై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
ఏదేమైనప్పటికీ లాక్ డౌన్ తర్వాత మళ్లీ చిత్రీకరణ పనులు మొదలయ్యే సూచనలు కనిపిస్తుండటంతో పలువురు ఆర్టిస్టులు మరియు నటీనటులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అంతే కాక సినీ పరిశ్రమల్లో పని చేస్తున్నప్పటికీ పూటగడవని వారు ఎందరో ఉన్నారని అలాంటి వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.