టాలీవుడ్‌లో బీరువా సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన అందాల భామ సురభి తెలుగు ప్రేక్షకులను అందంతో ఆకట్టుకుంది.ఆ తరువాత యంగ్ హీరో శర్వానంద్ ‘ఎక్స్‌ప్రెస్ రాజా’, నాని ‘జెంటిల్‌మెన్’ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అయితే అమ్మడికి అందంతోనే ఎక్కువ గుర్తింపు రావడంతో ఆమె యాక్టింగ్‌ను పట్టించుకున్న వారే లేరు.
దీంతో అందంతోనే అదరగొడదామని ఒక్కక్షణం సినిమాలో గ్లామర్ డోస్‌ను పెంచి మరీ నటించింది.
అయినా ఆమెకు అవకాశాలు మాత్రం రాలేదు.ఇక ఈ బ్యూటీ సినిమాల్లోకి రావాలనుకోలేదట.
దీనికి సంబంధించి ఓ ఇంటర్వ్యూలో తాజాగా కొన్ని కామెంట్స్ చేసింది.తన పేరెంట్స్ తాను పెయింటర్ అవుతానని అనుకున్నారట.
కానీ అనుకోకుండా సినిమాల్లోకి రావడంతో హీరోయిన్‌గా మారాల్సి వచ్చిందని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది.
తన తల్లిదండ్రలు తనకు అన్ని విషయాల్లో ఎంకరేజ్ చేస్తూ వచ్చారని, త్వరలో మంచి సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటానని ధీమా వ్యక్తం చేసింది.
మరి సురభి నిజంగానే మళ్లీ సినిమాల్లో కమ్‌బ్యాక్ ఇవ్వగలదా లేదా అనేది చూడాలి.