కరోనాపై ప్రభుత్వాలు చేస్తున్న పోరాటానికి మన తెలుగు సెలబ్రిటీలు కూడా తమవంతు సాయం చేస్తూ ముందుకి వస్తున్నారు.మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్ విరాళం చేసిన తర్వాత ఒక్కసారిగా కదిలి వచ్చారు.
ఎవరికీ తోచిన స్థాయిలో వారు విరాళాలు ఇచ్చి తమ పెద్ద మనసు చూపించుకున్నారు.ఇక ఇప్పుడు టాలీవుడ్ స్టార్స్ దారిలోనే మన డార్లింగ్ ప్రభాస్ కూడా గొప్ప మనసు చూపించాడు.
ప్రస్తుతం రాధాకృష్ణ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని ఇండియా వచ్చి హోం క్వారంటైన్ లో ఉన్న ప్రభాస్ కరోనాపై ప్రభుత్వాలు చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలబడ్డాడు.అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలకి 50 లక్షల చొప్పున విరాళం ఇచ్చాడు.
అలాగే పిఎం రిలీఫ్ ఫండ్ కి మూడు కోట్లు విరాళంగా ఇచ్చారు.ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అందరికంటే మా డార్లింగ్ ఒక మెట్టు పైనే ఉంటారని గొప్పగా చెప్పుకుంటున్నారు.