ప్రస్తుత కాలంలో కొందరు సమాజంలో మంచి పేరున్న వ్యక్తులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కటకటాల పాలవుతున్నారు.తాజాగా తమిళనాడుకు చెందినటువంటి ఓ వ్యక్తి ఏకంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై పై అసభ్యకర పోస్టులు పెట్టినందుకుగాను ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళితే తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి సాధిక్ భాష అనే వ్యక్తి సినిమాల్లో సహాయ నటుడుగా పని చేస్తున్నాడు.అయితే ఇతడు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ అయినటువంటి తమిళిసై పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తన ఫేస్ బుక్ ఖాతా లో పోస్ట్ చేశాడు.
దీంతో ఈ పోస్ట్ అసభ్యకరంగా, గవర్నర్ తమిళిసై పరువుకు భంగం కలిగించే విధంగా ఉండటమే గాకుండా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఇలాంటిఅనుచిత వ్యాఖ్యలు చేసింది సాధిక్ భాష అని గుర్తించారు.
వెంటనే సాధిక్ భాష పై కేసు నమోదు చేస్తూ అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.అయితే అప్పటికే సాదిక్ తన అత్తగారి ఊరు అయినటువంటి కట్టుమేడి మీ గ్రామంలో ఉండగా పోలీసులు అక్కడికి వెళ్లి అరెస్టు చేశారు.
అంతేగాక ప్రస్తుతం సమాజంలోని సాధిక్ భాష లాంటి కొందరు వ్యక్తులు పేరు, గౌరవం కలిగినటువంటి పెద్ద వాళ్లను టార్గెట్ చేస్తూ వారిపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పాపులర్ కావాలని చూస్తున్నారని ఇలాంటివి సరికాదని అన్నారు.అంతేగాక ఇక నుంచి ఎవరైనా అసభ్య పదజాలాన్ని ఉపయోగించి పోస్టులు పెట్టిన లేదా ప్రముఖులు, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినా కటకటాల పాలు కాకతప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.