ప్రస్తుత కాలంలో కొందరు మృగాలు లాంటి వ్యక్తుల కోరికలకు ముక్కుపచ్చలారని పసిపిల్లలు బలవుతున్నారు.తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో ఓ 55 ఏళ్ళు కలిగినటువంటి ముసలి వ్యక్తి అభం శుభం తెలియని నాలుగు సంవత్సరాలు కలిగిన చిన్నారిపై అత్యాచారం చేయడానికి యత్నించిన ఘటన కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి ఓ గ్రామంలో లో నాలుగు సంవత్సరాలు కలిగిన చిన్నారి తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటోంది.అయితే ఇదే గ్రామంలోనే 58 ఏళ్లు కలిగినటువంటి ఓ ముసలి వ్యక్తి కూడా నివాసముంటున్నాడు.
కాటికి కాళ్ళు చాపుకుని చావు కోసం ఎదురు చూస్తున్న వయసులో ముక్కుపచ్చలారని నాలుగు సంవత్సరాల చిన్నారిపై తను కన్ను పడడంతో ఆమెను చిదేమెయ్యలని వేయాలని పన్నాగం పన్నాడు.అనుకున్నదే తడవుగా ఇంట్లోని కుటుంబ సభ్యులు తమ తమ పనుల్లో నిమగ్నమై ఉండగా చిన్నారికి మొక్కజొన్న కంకులు ఆశను ఎరగా వేశాడు.
అయితే అమాయకంగా తన వద్దకు వచ్చినటువంటి చిన్నారి పై అత్యాచారం చేయడానికి పక్కనే ఉన్నటువంటి మొక్కజొన్న తోటలోకి తీసుకెళ్ళాడు.ఇది గమనించినటువంటి చిన్నారి తల్లి వెంటనే అతనిని వెంబడించింది.అయితే అప్పటికే ముసలి వ్యక్తి పాపపై అత్యాచారయత్నం చేయడం మొదలు పెట్టాడు.దీంతో వెంటనే తల్లి అతడిని అడ్డుకునేందుకు యత్నించినా ముసలి వ్యక్తి ఆమెను పక్కకు నెట్టి వేసాడు.
దీంతో చిన్నారి తల్లి ఏం చేయాలో తెలియక గట్టిగా కేకలు వేసింది.ఆ కేకలు విన్న భర్త వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ముసలి వ్యక్తిని చితకబాది పాపను రక్షించాడు.
అలాగే స్థానికుల నుంచి సమాచారం అందుకున్న టువంటి పోలీసులు వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.