మెగా కాంపౌండ్ నుండి వస్తున్న మరో హీరో వైష్ణవ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఉప్పెన’ రిలీజ్‌కు రెడీ అవుతోంది.సాయ ధరమ్ తేజ్ సోదరుడైన వైష్ణవ్ తేజ్ తొలి చిత్రంతో మంచి హిట్ కొట్టాలని కసిగా చేస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కు అదిరిపోయే సంగీతాన్ని ఇస్తున్నాడు టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్.
ఇప్పటికే రిలీజ్ అయిన ‘నీ కన్ను నీలి సముద్రం’ అనే పాటకు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.ఈ పాటను యూట్యూబ్‌లో మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా తెగ షేర్లు చేయడంతో ఈ పాట ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది.
ఇక ఈ పాటకు ఇప్పటికే 10 మిలియన్ వ్యూ్స్ రావడంతో చిత్ర యూనిట్ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ సినిమాను బుచ్చిబాబు సాన డైరెక్ట్ చేస్తుండగా సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.తమిళ నటుడు విజయ్ సేతుపతి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుండగా ఈ సినిమాను ఏప్రిల్ 2న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.