టాలీవుడ్ లో ప్రస్తుతం నందమూరి నటసింహం బాలయ్య బాబు ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ పనులు కూడా ఈ మధ్యనే ప్రారంభమయ్యాయి.
అయితే తాజాగా నందమూరి బాలకృష్ణ కి సంబంధించినటువంటి ఓ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.ఇంతకీ అదేంటంటే నందమూరి బాలకృష్ణ హెయిర్ ఒరిజినల్ కాదని అంతేగాక ఈ మధ్యకాలంలో బాలకృష్ణ ఎక్కువగా హెయిర్ లాస్ అయ్యాడని అందువల్ల హెయిర్ ని ట్రాన్స్ ప్లాంట్ చేయించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు పలు వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.
అయితే ఇటీవల కాలంలో నందమూరి బాలకృష్ణ గుండు తో దర్శనమిస్తున్నాడు.దీంతో బాలయ్య బాబు ఈ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ కోసమే గుండు కొట్టించుకున్న త్లు పలువురు బాలయ్య అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
అంతేగాక బాలయ్య బాబు గతంలో కూడా తన జుట్టు కోసం విగ్గుని వాడేవాడు.ఇక నుంచి ఈ విగ్గు కి కూడా గుడ్ బై చెప్పాలని ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే తాజాగా బాలయ్య బాబు నటిస్తున్న బోయపాటి చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో అఘోరా గా కనిపిస్తున్నాడని కూడా సమాచారం.అంతేగాక ఈ విషయానికి సంబంధించి బాలయ్య బాబు ప్రస్తుతం వారణాశి లో చిత్రీకరణ జరుపుకుంటున్నట్లు సమాచారం.ఈ చిత్రంలో కథానాయికలుగా కోలీవుడ్ బ్యూటీ నయనతార, తెలుగు భామ అంజలి నటిస్తున్నారు.