అన్న బాటలో నడుస్తున్న సురేష్ బాబు చిన్న కొడుకు

స్టార్ నిర్మాత సురేష్ బాబు తనయుడుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని రానా సొంతం చేసుకున్నాడు.త్వరలో అరణ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.

 Suresh Babu Plan To Launch Abhiram As A Hero-TeluguStop.com

మరో వైపు విరాటపర్వం సెట్స్ పైన ఉంది.దీని తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో హిరణ్యకశిప సినిమా సెట్స్ పైకి వెళ్తుంది.

పాన్ ఇండియా మూవీగా మైథలాజికల్ కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇదిలా ఉంటే రానా దారిలోనే సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు.

దీనికోసం విశాఖలో కొంత కాలం ఉండి సత్యానంద్ దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నారు.ప్రస్తుతం ముంబైలో నటనతో పాటు బాడీ లాంగ్వేజ్, డాన్స్, యాక్షన్ సీక్వెన్స్ లో శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

హీరోకి తగ్గ ఆహార్యం వచ్చిన వెంటనే అభిరామ్ ని లాంచ్ చేయడానికి సురేష్ బాబు సిద్ధం అవుతున్నారు.దీని కోసం ఓ యువ దర్శకుడు చెప్పిన కథని ఇప్పటికే లాక్ చేసినట్లు తెలుస్తుంది.

అయితే అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన కూడా రానా తరహలో యూనివర్శల్ హీరోగా మారే అవకాశం లేదనే టాక్ వినిపిస్తుంది.ఇప్పటికే శ్రీరెడ్డి వ్యవహారంలో అభిరామ్ మీద ఇండస్ట్రీతో పాటుబయట కూడా చాలా నెగిటివ్ రిమార్క్ ఉంది.

ఇలాంటి టైంలో హీరోగా అంటే ఎంత వరకు రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube