పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వడంతో ఆయన సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా పవన్ ఏకంగా 5 సినిమాలు చేస్తాడనే వార్త ప్రస్తుతం టాలీవుడ్లో తెగ హల్చల్ చేస్తోంది.
ఈ జాబితాలో ప్రస్తుతం తెరకెక్కుతున్న ‘లాయర్ సాబ్’ చిత్రంతో పాటు క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమా కూడా ఒకటి ఉంది.
గతంలో పవన్ వరుస ఫెయిల్యూర్లతో సతమతమవుతున్నప్పుడు ‘గబ్బర్‌సింగ్’ చిత్రంతో ఆయనకు అదిరిపోయే సక్సెస్‌ను అందించాడు దర్శకుడు హరీష్ శంకర్.
ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై పవన్ నటించబోయే సినిమాకు దర్శకుడు హరీష్ శంకర్‌ను ఎన్నుకున్నారు చిత్ర యూనిట్.ఇక ఈ కాంబోలో రాబోయే సినిమాకు హరీష్ శంకర్ ఓ రీమేక్ కథను రెడీ చేస్తున్నాడనే వార్త ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
అయితే ఈ వార్తపై దర్శకుడు హరీష్ శంకర్ స్పందించాడు.పవన్ లాంటి స్టార్ హీరో కోసం ఎలాంటి కథను రెడీ చేయాలో తనకు తెలుసని, అనవసరంగా ఇలాంటి పుకార్లను పుట్టించవద్దని ఆయన ట్విట్టర్ వేదికగా కోరాడు.
దీంతో పవన్ కోసం హరీష్ శంకర్ రీమేక్ చిత్రాన్ని రెడీ చేయడం లేదనే విషయం స్పష్టం అయ్యింది.మరి పవన్‌తో ఆయన ఎలాంటి సినిమాను తెరకెక్కిస్తాడో చూడాలి అంటున్నారు సినీ ప్రేమికులు.