వైరల్: ఆస్ట్రేలియాలో పట్టపగలే చీకటి.. ఏమైందో తెలిస్తే..

వాతావరణ మార్పులు ఇప్పుడు ఎలా ఉన్నాయో అందరికి తెలిసిందే.అయితే అలాంటి ఈ మార్పుల కారణంగా ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందో చెప్పలేం.

 Australia Bushfire Video-TeluguStop.com

అలానే ఆస్ట్రేలియాలో క్షణాల్లో వాతావరణం మారిపోయింది.పట్టపగలే చీకట్లు అలుముకున్నాయి.

అలాని ఇది మబ్బులు రావడం వల్ల అని అనుకునేరు.కానీ అది నిజమైన కారణం కాదు.

ఆస్ట్రేలియాలో ఇటీవలే వాతావరణం మార్పు ‘కార్చిచ్చు’ గుర్తు ఉండే ఉంటుంది.ఈ కార్చిచ్చు ఆస్ట్రేలియాను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే.ఈ కార్చిచ్చులో ఎన్నో ముగా జీవాల ప్రాణాలు పోయాయి.ఒక కంగారు కార్చిచ్చులో కాలిన ఫోటో చూసి సోషల్ మీడియా అంత ఏడ్చేసింది.

ఆలా చేసింది ఆ కార్చిచ్చు.చావు అంత ప్రమాదకరంగా ఉంటుందా? అని తెలిసేలా ఆ కార్చిచ్చు చేసింది.

అయితే ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా అడవులను చుట్టుముట్టిన సమయంలో అక్కడ దట్టమైన పొగ ఆకాశాన్ని కప్పేయడంతో సూర్యరశ్మి సైతం నేలను తాకలేదు.దీంతో పట్టపగలే చీకటి అలుముకుంది.

ఆ సమయంలో అక్కడ అగ్నిని ఆర్పడానికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది ఆ ముప్పును ముందే పసిగట్టి అక్కడ నుండి ప్రాణాలతో బయటకు వెళ్లారు.

కానీ అక్కడే ఓ అగ్నిమాపక వాహనాన్ని వదిలేశారు.

దీంతో ఆ వాహనంకు ఉన్న కెమెరాతో వాతావరణంలో ఏర్పడ్డ మార్పులు అన్నింటిని చాలా చక్కగా షూట్ చేసింది.ఆ కార్చిచ్చులో అగ్నిమాపక వాహనం కాలిపోయిన కెమెరా చెక్కుచెదరలేదు.

దీంతో ఆ వీడియోను డన్మోర్ అగ్మిమాపక శాఖ తమ ఫేస్‌బుక్ పేజీలో వీడియోను పోస్టు చేశారు.దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కార్చిచ్చు ఎంత ప్రమాదకరమో తెలియచెయ్యడానికే కార్చిచ్చు ఆ కెమెరాను కాల్చేయలేదు అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube