ఈ మధ్యకాలంలో టిక్ టాక్ లో ఫేమస్ అవ్వడానికి ఎన్ని రకాల కోతి చేష్టలు చేస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలిసిందే.టిక్ టాక్ ఒక వ్యసనం.
టిక్ టాక్ లో మన వీడియో అప్లోడ్ చేస్తే వచ్చే వ్యూస్, లైక్స్, కామెంట్స్ కోసం ప్రజలు చచ్చిపోతున్నారు.కొంతమంది విన్యాసాలు చేసి ప్రాణాలనే విడిచిన రోజులు ఉన్నాయి.
ఎంతోమంది ఈ టిక్ టాక్ కారణంగా అనారోగ్యం పాలవ్వడం ఒక్కటైతే.టిక్ టాక్ స్టార్ అనిపించుకోడానికి ఎన్ని అవమానాలు అయినా ఎదురుకుంటారు చాలామంది.అలానే ఓ యువతీ సరికొత్త విన్యాసం చేసింది.అష్టకష్టాలు పడింది.
చూస్తే అయ్యో అనిపిస్తుంది కానీ ఇలాంటి వారికీ ఇలా జరగాల్సిందే అని కూడా అనిపిస్తుంది అని అంటున్నారు నెటిజన్లు.
అసలు వివరాల్లోకి వెళ్తే.
ఆమె టిక్ టాక్ కు బానిస అయ్యింది.టిక్ టాక్ లో ఫేమస్ అయ్యేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది.
చివరికి మౌత్ ఆర్గాన్‌ను నోట్లోకి దూర్చుకుని సంగీతం వినిపించాలని అనుకోని ప్రయోగం చేసింది.అప్పటికి సంగీతం అయితే వినిపించింది కానీ, ఆ మౌత్ ఆర్గాన్ మాత్రం బయటకు తియ్యలేక పోయింది.
నోట్లో అడ్డంగా ఇరుక్కు పోయిన మౌత్ ఆర్గాన్‌ను బయటకు తీసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది.కానీ ఎటువంటి ఉపయోగం లేకపోవడంతో డాక్టర్‌ను సంప్రదించింది.ఆ డాక్టర్ కూడా ఎంతో కస్టపడి ఆ మౌత్ ఆర్గాన్ ను నోటి నుండి తీసేసాడు.ఆ మౌత్ ఆర్గాన్ ఇంకా నోట్లోనే ఉండటంతో ఆమె శ్వాస తీసుకున్న సంగీతమే.
వదిలిన సంగీతమే.దీంతో ఆ వీడియోను తీసి ఆమె టిక్ టాక్ లో పెట్టింది.
అది కాస్త జనాలకు నచ్చింది.సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఎట్టకేలకు ఆమె టిక్ టాక్ స్టార్ అవ్వాలి అనుకున్న కల నెరవేరింది.దీంతో.
మళ్ళి టిక్ టాక్ వీడియోలు తియ్యడం ప్రారంభించింది.ఇప్పుడు ఆమె వీడియోలకు లైకులే లైకులు.
కామెంట్లు.ప్రస్తుతం ఆమె వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.