ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టి పాస్ చేసుకున్న విషయం తెల్సిందే.ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో చాలా పట్టుదలతో వ్యవహరిస్తుంది.
ఇదే సమయంలో ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ మరియు జనసేన పార్టీలు మాత్రం మూడు రాజధానులు వద్దు, ఒకేరాజధాని అది అమరావతే ముద్దు అంటూ రైతులతో కలిసి ఆందోళనలు చేస్తున్నాయి.నిన్న మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యలయంలో పవన్ కళ్యాణ్‌తో రైతులు పెద్ద ఎత్తున భేటీ అయ్యారు.
ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ జగన్ తీసుకున్న ఈ నిర్ణయం వైకాపా రాజకీయ భవితవ్యంకు చరమగీతం పాడబోతున్నట్లుగా పవన్ ఎద్దేవ చేశాడు.ఆందోళనలతో వైకాపా ప్రభుత్వంను పడగొట్టే వరకు జనసేన విశ్రమించదంటూ పవన్ హెచ్చరించాడు.
ఢిల్లీకి వెళ్లి ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించబోతున్నట్లుగా కూడా పవన్ ప్రకటించాడు.అయితే వైకాపా ప్రభుత్వంను పడగొట్టే సత్తా ఒక్క ఎమ్మెల్యే(?) కూడా లేని జనసేన వల్ల అయ్యేనా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.