అమెరికాలో మరోసారి భారతీయులపై జాతి విద్వేషాన్ని వెళ్లగక్కారు గుర్తుతెలియని వ్యక్తులు.సోమవారం కాలిఫోర్నియా రాష్ట్రం ఆరెంజ్‌వాలేలోని గురుమానేయో గ్రంథ్ గురుద్వారా సాహిబ్ గోడలపై ‘‘వైట్ పవర్’’ అనే అక్షరాలతో పాటు స్విస్తిక్ ముద్రను పెయింట్‌లా వేసివుండటాన్ని పలువురు సిక్కులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై స్థానిక సిక్కు సమాజం మండిపడింది.
గురుద్వారాలో జాతి విద్వేష వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లుగా ఇండో-అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు డాక్టర్ అమీ బేరా అన్నారు.
కాలిఫోర్నియాలోని 7వ కాంగ్రెస్ జిల్లా భిన్న సంస్కృతులు, జాతుల నిలయమని.ఇందులో సిక్కు సమాజం అంతర్భాగమని ఆయన తెలిపారు.గురుమానేయో గ్రంథ్ గురుద్వారా సాహిబ్ సంగత్‌కు చెందిన డింపుల్ కౌర్ భుల్లార్ మాట్లాడుతూ.తాము జనవరి గతేడాది డిసెంబర్ చివరి నుంచి జనవరి 12 మధ్య గురుద్వారాలో సేవలను ప్రారంభించామని, దీనికి ముందు ఈ తరహా వాతావరణం లేదన్నారు.
అమెరికన్ సిక్కు లీగల్ డిఫెన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్, సిక్కు అమెరికన్ పౌరహక్కుల సంఘం సైతం జాత్యహంకార వ్యాఖ్యలను ఖండించింది.దీనిపై హర్బన్స్ సింగ్ స్రాన్ అనే సిక్కు ప్రముఖుడు మాట్లాడుతూ.సిక్కు మతం అంటే ఏమిటో వారికి తెలిస్తే, వారు అలా చేయరని స్థానిక శాక్రమెంటో బీ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు.దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురుద్వారా ప్రధాన పూజారి వాంగ్మూలాన్ని నమోదు చేశారు.