జియో మరో సంచలనం.. కేవలం రూ.399 కే జియో ఫోన్... ?

భారత టెలికాం రంగంలో ప్రముఖ రిలయన్స్ జియో సంస్థ ఏ నిర్ణయం తీసుకున్నా అది సంచలనాత్మక మార్పులు తెస్తోంది. ఇప్పటికే రిలయెన్స్ కి సంబంధించిన జియో భారత టెలికాం రంగంలో అగ్రగామిగా దూసుకుపోతోంది.

 Reliance Jio Planning To Launch New Phone-TeluguStop.com

అయితే తాజాగా కథనాల ప్రకారం ఈ సంస్థ అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని ఆపేసిన సంగతి తెలిసిందే. దీంతో కొంత మేర జియో వినియోగదారులు మరో టెలికాం దిగ్గజ సంస్థలైనటువంటి ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

దీంతో ఎలాగైనా తమ కస్టమర్లని మళ్లీ తిరిగి రప్పించేందుకు జియో సంస్థ సన్నాహాలు చేస్తోంది.

అయితే ఇందులో భాగంగా  699 విలువైన జియో ఫోన్ ని కేవలం 399 రూపాయలకి అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అంతేకాకుండా ఈ ఫోన్ కి కేవలం 50 రూపాయల రీఛార్జి చేసుకుంటే 30 రోజుల వ్యాలిడిటీ తో అపరిమిత కాల్స్ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పించనున్నారు. అయితే ఈ ఫోన్ గురించి అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడక పోయినా కూడా సంస్థ ప్రతినిధులు మాత్రం ప్రస్తుత మార్కెటింగ్ పరిస్థితులను బట్టి చూస్తే కచ్చితంగా ఈ ఫోన్ ని వార్షిక సమావేశాల తర్వాత విడుదల చేసే సూచనలు ఉన్నాయని చెబుతున్నారు.

Telugu Rupeesphone, Reliance Jio, Reliancejio-

ఒకవేళ ఈ ఫోన్ కనుక విడుదలైతే టెలికాం రంగంలో జియో మరో సంచలనాత్మక మార్పు తీసుకువస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.అంతేగాక మళ్లీ దేశీ మార్కెట్లో పుంజుకుంటుందని అందువలనే జియో సంస్థ ప్రతినిధులు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పలువురు సాంకేతిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అయితే ఇది ఇలా ఉండగా మరికొందరైతే ప్రస్తుతం జియో రీఛార్జి రేట్లు పెరగడం మరియు అపరిమిత ఫోన్ కాలింగ్ నిలిపి వేయడం వంటి వాటితో జియో మార్కెట్ కొంత మేర పతనం అయిందని అందువలనే ఇలాంటి ఆఫర్ల ద్వారా తమ కస్టమర్లని అంటే పెట్టుకునేందుకు జియో సంస్థ సన్నాహాలు చేస్తుందని సమాచారం.అయితే ఏదేమైనప్పటికీ టెలికాం రంగంలో ఎటువంటి అంచనాలు లేకుండా ఒక్కసారిగా అడుగు పెట్టిన కొంతకాలానికి ఏకంగా అగ్ర స్థానాన్ని ఆక్రమించడం ఒక్క జియో సంస్థకు మాత్రమే సాధ్యమైంది…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube