అక్కినేని కోడలు సమంత ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుంది.ఆమె నటనకు ఎక్కవ స్కోప్ ఉన్న సినిమాలకే ఓటేస్తుంది.
ఇటీవల ఆమె నటించిన ఓ బేబి సినిమా చూస్తే ఈ విషయం ఎవరికైనా అర్ధమవుతుంది.కాగా తాజాగా ఓ హీరో రుణం తీర్చుకునేందుకు సమంత రెడీ అయ్యింది.
ఇంతకీ ఆ హీరో ఎవరు? ఆ కథ ఏమిటో తెలుసుకుందామా?
ఓ బేబీ సినిమా సమంత కెరీర్లో చాలా ప్రత్యేకమైన సినిమా.ఆ సినిమాలో సమంత మెయిన్ లీడ్‌గా నటించిన సంగతి తెలిసిందే.
తన యాక్టింగ్‌తో ఆ సినిమాను సమంత తన భుజాలపై మోసింది.అయితే సినిమా సక్సెస్ అయినా కమర్షియల్ పరంగా మాత్రం సక్సెస్ కాలేదు.
ఇక ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, లక్ష్మీలు ముసలి పాత్రల్లో నటించారు.అయితే సమంతను ప్రేమించే వ్యక్తిగా నాగశౌర్య ఈ సినిమాలో నటించాడు.
ఓ బేబీ సినిమాలో నటించేందుకు నాగశౌర్య ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని, కేవలం సమంత కోరిక మేరకు నటించాడనేది టాక్.

ఇప్పుడు నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం ‘అశ్వధ్ధామ’ చిత్ర టీజర్‌ను లాంచ్ చేయాల్సిందిగా సమంతను కోరాడట నాగశౌర్య.దానికి వెంటనే సమంత ఒప్పేసుకుందని తెలుస్తోంది.ఈ విధంగా నాగశౌర్య రుణం తాను తీర్చుకుంటున్నట్లు సమంత ఫీల్ అవుతుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
ఇక నాగశౌర్య నటిస్తున్న ఈ సినిమాలో మెహ్రీన్ పీర్జాదా హీరోయిన్గా నటిస్తోండగా రమణ తేజ అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తున్నాడు.ఈ సినిమాను జనవరి 31న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.