మద్యం మత్తులో మనుష్యులు ఏం చేస్తుంటారో వారికే తెలియదు.ఒక్కోసారి వారు చేసే పనులకు నవ్వాలో లేక విచారించాలో అర్ధం కాదు.
తాజాగా ఓ మందుబాబు చేసిన పనికి ఓ వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు.ఇంతకీ ఆ వ్యక్తిని సదరు మందుబాబు ఏం చేశాడో తెలుసా, పెదాలపై కొరికాడు.
అవును, మీరు చదివింది నిజమే.లక్నోలోని అలంబాగ్లో మంగళవారం రాత్రి శాలు(28) అనే వీడియోగ్రాఫర్ ఫుటుగా మద్యం సేవించాడు.ఆ తరువాత ఓ పాన్ షాపు వద్దకు వెళ్లి తనకో పాన్ ఇవ్వాలని కోరాడు.అయితే అది కూడా ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
కానీ అప్పటికే దుకాణం సర్దేసుకున్న షాపు యజమాని సత్యేంద్ర పాన్ ఇవ్వనని తేల్చి చెప్పాడు.దీంతో మందుబాబుకు ఎక్కడలేని కోపం రావడంతో పక్కనే ఉన్న రాయి తీసుకొని సత్యేంద్రపై దాడి చేశాడు.
అంతేగాక అతడి కిందిపెదవిని గట్టిగా కొరికాడు.
దీంతో స్థానికులు సత్యేంద్రను వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు.
మద్యం మత్తులో సత్యేంద్ర ఎడమ చెవి, కింది పెదవిని కొరికన శాలుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఏదేమైనా మద్యం మత్తులో మనోడు చేసిన పనికి అక్కడున్నవారు నోరెళ్లబెట్టారు.