హైదరాబాదులో హిజ్రాని కూడా వదలని కామాంధులు...

తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాదులో మహిళలపై అత్యాచారాలు రోజురోజుకి ఎక్కువ అవుతున్నాయి.అయితే మొన్నటికి మొన్న మతిస్థిమితం లేనటువంటి మహిళపై ముగ్గురు కామాంధులు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన మరవకముందే తాజాగా ఒక హిజ్రా పై ఆటో డ్రైవర్ అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.

 Hyderabad Hijra Telangana Bachupalli-TeluguStop.com

వివరాల్లోకి వెళితే హైదరాబాదులోని బాచుపల్లి ప్రాంతంలో నగరానికి చెందిన ఓ  హిజ్రా ఆటో ఎక్కింది.అయితే ఆమె ఒంటరిగా ఉండడంతో ఆమెపై ఆటోడ్రైవర్ కన్నేశాడు.ఈ క్రమంలో తన స్నేహితులకు ఫోన్ చేసి తాము వెళ్తున్న రోడ్డు మధ్యలోకి రమ్మని చెప్పాడు.ఆ తర్వాత ఆటోని  నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి ఆపి ఆమెపై అత్యాచా రానికి పాల్పడ్డాడు.

అయితే అప్పటికే తన స్నేహితులు వచ్చి ఉండడంతో నలుగురు కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.అనంతరం ఆమె ఎలాగో వారినుంచి తప్పించుకొని అక్కడి నుంచి పారిపోయింది.

అయితే ఉదయాన్నే దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్లి తనపై జరిగిన  అఘాయిత్యం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రముఖ నిందితుడు ఆటో డ్రైవర్ మహేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

Telugu Hyderabad, Telangana-Telugu Crime News(క్రైమ్ వార్త

అయితే రాష్ట్రంలో ఇన్నిరోజులు మహిళలకే రక్షణ లేదు అనుకున్నాను కానీ చివరికి హిజ్రాలను కూడా వదలడం లేదంటే నగరంలో కామాంధుల ఆగడాలు ఎంతలా మితిమీరిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చని ఆ హిజ్రా వాపోతోంది.అంతేగాక రాష్ట్రం నలుమూలలా జరుగుతున్నటువంటి అత్యాచారాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రంలో అత్యాచారాలు ఇంకా ఎక్కువ అవుతాయని మహిళలకు పిల్లలకు రక్షణ అన్నారు.ఆమెకు తోడుగా తోటి హిజ్రాలు మద్దతు పలికారు.  అలాగే ఆటో డ్రైవర్ మహేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube