మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉత్తమ నటుడుగా రంగస్థలం సినిమాకి జాతీయ అవార్డుని అందుకున్నాడు.ఉత్తమ అవార్డు అందుకోవడం ద్వారా ఇన్ని సంవత్సరాలు చిరంజీవి ఇమేజ్ ని పెట్టుకొని హీరోగా వచ్చాడు అనే ప్రతి ఒక్కరికి సమాధానం దొరికినట్లు అయ్యింది.
ధ్రువ, రంగస్థలం సినిమాలతో నటుడుగా తనని తాను ప్రూవ్ చేసుకున్న రామ్ చరణ్ ఇప్పుడు మరోసారి తన నట విశ్వరూపం చూపించడానికి అల్లూరి సీతారామరాజు పాత్రలో ఆర్ఆర్ఆర్ సినిమాలో కనిపించబోతున్నాడు.భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా సూపర్ హిట్ అయితే రామ్ చరణ్ కూడా నేషనల్ హీరో అయిపోవడం పక్కా అని చెప్పాలి.
ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ఎవరితో సినిమా చేయాలనే దానిపై ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెడుతున్నారు.ఇప్పటికే స్టార్ దర్శకుల కథలు వింటున్న రామ్ చరణ్ మంచి కమర్షియల్ సబ్జెక్ట్ తో రావాలని అనుకుంటున్నాడు.
ఇదిలా ఉంటే ఈ మధ్య రామ్ చరణ్ దృష్టి ఓ తమిళ దర్శకుడు మీద పడిందనే మాట వినిపిస్తుంది.సందీప్ కిషన్ నగరం సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన లోకేష్ కనకరాజ్ తాజాగా కార్తీతో ఖైదీ సినిమా తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టాడు.
ఇదే స్పీడ్ తో స్టార్ హీరో విజయ్ తో సినిమా చేసే అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు.ఇప్పుడు అదే సినిమా పనిలో ఉన్నాడు.మంటే టాలెంట్ ఉన్న దర్శకుడుగా రెండు సినిమాలతోనే ప్రూవ్ చేసుకున్న లోకేష్ డిఫరెంట్ స్క్రీన్ ప్లేలో ఆకట్టుకుంటున్నాడు.ఈ నేపధ్యంలో అతని దర్శకత్వంలో రంగస్థలం తరహాలో డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమా చేయాలని రామ్ చరణ్ ఆలోచిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.
ఇక ఈ విషయాన్ని దర్శకుడు దృష్టికి కూడా తీసుకెళ్ళాడని సమాచారం.లోకేష్ విజయ్ సినిమా చేసిన తర్వాత రామ్ చరణ్ కోసం కథ సిద్ధం చేసే అవకాశం ఉందని తమిళ మీడియాలో వినిపిస్తుంది.
తెలుగు, తమిళ మార్కెట్ ని దృష్టిలో ఉంచుకొని రామ్ చరణ్ అతనితో సినిమా కోసం ప్రయత్నం చేస్తున్నాడని టాలీవుడ్ లో వినిపిస్తున్న మాట.