టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన మూవీ బాహుబలి గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు.రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ ఎంట్రీ జలపాతం వద్ద ఉంటుంది.
ఆయన ఎత్తైన కొండలను అధిరోహిస్తూ జలపాతాల అందాలను చూడాలని అనుకుంటాడు.ఇప్పుడు ఇదే ఫార్ములాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఫాలో కానున్నాడు.
స్టౌలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా తరువాత బన్నీ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నాడు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన తొలి షెడ్యూల్‌ను కూడా పూర్తి చేశాడు బన్నీ.అయితే తాజాగా బన్నీ ఇంట్రోకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ షెడ్యూల్‌ను చిత్ర యూనిట్ షూట్ చేసినట్లు తెలుస్తోంది.
ముహూర్తపు రోజున బన్నీపై తీసిని షాట్‌ను, తాజాగా అందమైన జలపాతం వద్ద చిత్రీకరించిన సీన్లను కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా మనకు చూపించనున్నారు.
ఏదేమైనా సుకుమార్-బన్నీ సినిమా అంటేనే ఆ అంచానాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే.
ఇప్పుడు తాజాగా వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ సినిమాను పర్ఫెక్ట్‌గా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ అన్ని విధాలా ప్రయత్నిస్తుంది.ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర యూనిట్ అతి త్వరలో వెల్లడించనున్నారు.