ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉంటాయన్న జగన్ ప్రకటనపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి తీవ్రంగా మండిపడ్డారు.రాజధానిని అమరావతి నుంచి తరలించడానికి జగన్ తాత దిగి రావాలి అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
ఇదేమైనా చిన్నపిల్లలాట అనుకుంటున్నారా అంటూ జగన్‌ను నిలదీశారు.అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ.
దానికి ఇది సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు.
ఇక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని సర్వే ఆఫ్ ఇండియా కూడా గుర్తించిందని, ఇప్పుడు రాజధానిని మారుస్తామంటే కేంద్రం చూస్తూ ఊరుకోదని సుజనా చెప్పడం గమనార్హం.కేవలం అసెంబ్లీ మాత్రమే ఉంటే దానిని రాజధాని అని ఎవరూ అనరు.అయినా కేవలం అసెంబ్లీ నిర్మాణం కోసమే కేంద్రం రూ.2500 కోట్లు ఇచ్చిందా.అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం ఈ మొత్తం ఇచ్చారు అని సుజనా చౌదరి తేల్చి చెప్పారు.
జగన్ ఇప్పుడు కూడా సూచనప్రాయంగా ఈ మాట చెప్పారు కాబట్టి కేంద్రం ఏమీ స్పందించలేదని, అధికారిక ప్రకటన చేస్తే మాత్రం తగిన రీతిలో స్పందిస్తుందని సుజనా చెప్పడం గమనార్హం.అయినా ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను పెట్టుకున్నంత ఈజీగా మూడు రాజధానులు పెట్టుకోవడం సాధ్యం కాదని ఆయన తేల్చేశారు.
అవగాహన లేమితో జగన్ అసెంబ్లీలో ఏదో ప్రకటన చేశారని, ఆయన ఏం చెప్పారో కూడా తనకు సరిగా అర్థం కాలేదని సుజనా అన్నారు.అసలు రాష్ట్రానికి మూడు రాజధానులు అన్నది హాస్యాస్పదంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
.