తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కి తమిళంలోనూ ఇటు తెలుగులోనూ ఎంత క్రేజ్ ఉందో మనకు బాగా తెలుసు.అయితే ఇందులో సాధారణ అభిమానులే కాక తెలుగులోని ప్రముఖ నటుల్లో కూడా రజినీకి వీరాభిమానులు ఉన్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు టాలీవుడ్ లో రజినీకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అని.
దీంతో రజిని సినిమా విడుదల అవుతుందంటే చాలు టాలీవుడ్ లో కొత్త సంబరం ఏర్పడుతుంది.అయితే ప్రస్తుతం రజనీకాంత్ దర్బార్ అనే చిత్రంలో నడుస్తున్నాడు.
ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన నయనతార నటిస్తుండగా అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందించారు.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ నిర్మిస్తోంది.
అయితే తాజాగా ఆయన నటించిన చిత్రం త్వరలోనే విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.ఒకప్పుడు రజనీకాంత్ సినిమా తెలుగులో విడుదల అవుతుందంటే బయ్యర్లు ఈ సినిమాని ఎగబడి కొనేవారు.కానీ ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో అలాంటి పరిస్థితిలు ఏమిలేనట్లు తెలుస్తోంది.ఎందుకంటే గతంలో భారీ అంచనాల నడుమ విడుదలైన కబాలి, కాలా వంటి చిత్రాలు ఆఖరి నిమిషంలో బయ్యర్లకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.
దీంతో ఇప్పుడు దర్బార్ అదే కోవకి చెందితే తాము పీకల్లోతు నష్టాల్లో కి కోరుకోవడం ఖాయమని అనుకున్న బయ్యర్లు దర్బార్ సినిమా తెలుగులో కొనడానికి ముందుకు రావడం లేదని సినీ వర్గాలు చర్చించుకుంటున్నారు.
అయితే ఇప్పటికే దర్బార్ చిత్రం ట్రైలర్ విడుదలయి మంచి ప్రేక్షకాదరణ పొందింది.
అయినా సరే బయ్యర్లు మాత్రం సినిమా హక్కులను కొనడానికి భయపడుతున్నట్లు సమాచారం.అయితే ఈ విషయంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పలు వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఇక రజనీకాంత్ సినిమాల్లో నటించడం మానేస్తే బాగుంటుందని, అతడి మార్కెట్ తెలుగులో పడిపోయిందని అంటూ పలు వ్యాఖ్యలు చేస్తూ నెట్టింట్లో ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు.అయితే ఈ వ్యాఖ్యలపై రజినీకాంత్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.
.