దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరుపై ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో భీబత్సమైన అంచనాలు క్రియేట్ అయ్యాయి.సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న ఈ సినిమా టీజర్, పోస్టర్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి.
కాగా ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి రీఎంట్రీ ఇస్తోన్న సంగతి కూడా తెలిసిందే.
అయితే రాములమ్మ రీఎంట్రీ ఎప్పుడో జరగాల్సి ఉందట.
కానీ రవితేజ కారణంగా అది వాయిదా పడినట్లు తెలుస్తోంది.దర్శకుడు అనిల్ రావిపూడికి విజయశాంతి అంటే చాలా ఇష్టమట.
ఆమెను ఎలాగైనా రీఎంట్రీ చేయించాలని చాలా ప్రయత్నాలు చేశాడట.ఈ క్రమంలో రాజా ది గ్రేట్ సినిమా కథలో హీరోగా ముందుగా రామ్‌ను అనుకున్న అనిల్, అతడి తల్లి పాత్రలో విజయశాంతిని నటింపజేయాలని చూశాడట.
కానీ ఆ సినిమా కాస్త రవితేజ చెంతకు చేరడంతో విజయశాంతి రీఎంట్రీ కూడా వాయిదా పడిందని తెలుస్తోంది.ఏదేమైనా రాములమ్మ రీఎంట్రీకి పరోక్షంగా రవితేజ కూడా ఓ కారణం అయ్యాడనేది వాస్తవమని సినీ జనం అంటున్నారు.
మరి సరిలేరు నీకెవ్వరు సినిమాలో రాములమ్మ ఎలాంటి పాత్రలో నటిస్తోందనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.