విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా ప్రీ రిలీజ్ వేడుక సమయంలో స్టేజ్‌పై ఒక బూతు మాట అన్నాడు.ఆ సినిమాను సెన్సార్ బోర్డు తొలగించిన నేపథ్యంలో సోషల్ మీడియా ఆ పదం గురించి బాగా పబ్లిసిటీ జరిగింది.
విజయ్ స్టేజ్‌పై జనాలతో వాటిని చెప్పించడం కొందరికి మింగుడు పడలేదు.ఆ విషయాన్ని అనసూయ తప్పుబట్టింది.
ఒక బాధ్యతగల హీరో ఇలా చేయడం ఏంటీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.దాంతో విజయ్ దేవరకొండ అప్పటి నుండి అనసూయపై నిప్పులు చెరుగుతూనే ఉన్నారు.
అనసూయ ఏ చిన్న తప్పు చేసినా దాన్ని పెద్దది చేసేందుకు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ రెడీగా ఉంటున్నారు.అలాంటిది విజయ్ దేవరకొండ తాను నిర్మించిన మొదటి సినిమాలో అనసూయకు కీలక పాత్రలో నటించే అవకాశం ఇచ్చాడు.
మీకు మాత్రమే చెప్తా సినిమాలో అనసూయ పాత్రకు మంచి ఆధరణ దక్కుతుంది.ఆమె తప్పకుండా ఈ పాత్రతో మరింతగా మంచి ఆఫర్లను దక్కించుకుంటుందని సినీ వర్గాల వారు అంటున్నారు.

అనసూయ వివాదంపై విజయ్ దేవరకొండ స్పందిస్తూ అనసూయ అంటే నాకు కోపం లేదు.ఆమెను నేను ఎప్పుడో క్షమించాను.నేను వెంటనే మర్చి పోతూ ఉంటాను.కొన్ని విషయాలను నేను ఎక్కువ కాలం క్యారీ చేయను.అలాగే అనసూయ విషయంలో కూడా నేను ఇప్పటికే మర్చి పోయాను అంటూ చెప్పాడు.కాని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మాత్రం అనసూయను సోషల్ మీడియాలో వదలడం లేదు.
తమ అభిమాన హీరో కాళ్లు పట్టుకుని క్షమాపన అడిగిందని అందుకే ఆమెకు ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చారంటూ కామెంట్స్ చేస్తున్నారు.