పార్టీ వీడేది లేదన్న గంటా

ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గత కొన్ని రోజులుగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడు.ఆయన పార్టీ వ్యవహారాలతో అంటీ ముట్టనట్లుగా ఉంటున్నాడు.

 Iam Not Leave The Tdp Party Says Ganta Srinivas Rao-TeluguStop.com

దాంతో గంటా టీడీపీని వీడటం ఖాయం అంటూ అంతా భావించారు.జగన్‌ అండ్‌ కో ను తట్టుకునేందుకు గంటా బీజేపీ తీర్థం తీసుకోవాలని భావిస్తున్నాడంటూ ప్రచారం జరిగింది.

బీజేపీ ముఖ్య నాయకులతో చర్చలు కూడా జరిగాయి.ఇలాంటి నేపథ్యంలో గంటా తాను పార్టీ వీడుతున్నట్లుగా వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చేశాడు.

నేడు పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నాడు.గత కొన్ని రోజులుగా వ్యక్తిగత కార్యక్రమాల వల్ల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నట్లుగా ఆయన పేర్కొన్నాడు.

తప్పకుండా తెలుగు దేశం పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకు వచ్చేందుకు తనవంతు కృషి చేస్తానంటూ ప్రకటించాడు.అధికారంలో ఉన్న వైకాపాపై గంటా విమర్శలు చేశాడు.

తాను పార్టీ మారుతున్నట్లుగా వారే ప్రచారం చేస్తున్నట్లుగా ఆరోపించాడు.పార్టీ మారే ఆలోచన లేదన్న గంటా శ్రీనివాసరావు త్వరలోనే నియోజక వర్గంలో విసృతంగా పర్యటిస్తానంటూ ప్రకటించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube