పార్టీ వీడేది లేదన్న గంటా

ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గత కొన్ని రోజులుగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడు.

ఆయన పార్టీ వ్యవహారాలతో అంటీ ముట్టనట్లుగా ఉంటున్నాడు.దాంతో గంటా టీడీపీని వీడటం ఖాయం అంటూ అంతా భావించారు.

జగన్‌ అండ్‌ కో ను తట్టుకునేందుకు గంటా బీజేపీ తీర్థం తీసుకోవాలని భావిస్తున్నాడంటూ ప్రచారం జరిగింది.

బీజేపీ ముఖ్య నాయకులతో చర్చలు కూడా జరిగాయి.ఇలాంటి నేపథ్యంలో గంటా తాను పార్టీ వీడుతున్నట్లుగా వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చేశాడు.

నేడు పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నాడు.గత కొన్ని రోజులుగా వ్యక్తిగత కార్యక్రమాల వల్ల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నట్లుగా ఆయన పేర్కొన్నాడు.

తప్పకుండా తెలుగు దేశం పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకు వచ్చేందుకు తనవంతు కృషి చేస్తానంటూ ప్రకటించాడు.

అధికారంలో ఉన్న వైకాపాపై గంటా విమర్శలు చేశాడు.తాను పార్టీ మారుతున్నట్లుగా వారే ప్రచారం చేస్తున్నట్లుగా ఆరోపించాడు.

పార్టీ మారే ఆలోచన లేదన్న గంటా శ్రీనివాసరావు త్వరలోనే నియోజక వర్గంలో విసృతంగా పర్యటిస్తానంటూ ప్రకటించాడు.

నిజమైన ప్రేమ బాధను మాత్రమే మిగులుస్తుంది… నాగచైతన్య కామెంట్స్ సమంత గురించేనా?