జేజమ్మ దృష్టి అంతా ఇప్పుడు ఆ టైపు సినిమాల మీదనే ఉంది

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తకనతూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న నటి స్వీటీ అనుష్క.సూపర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ మంగళూరు భామ అరుందతి సినిమాతో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్ గా మారిపోయి టాలీవుడ్ లో స్టార్ హీరోలతో జత కట్టి తిరుగులేని ఇమేజ్ ని సొంతం చేసుకుంది.

 Anuskha Committed Spanish Remake Movie-TeluguStop.com

ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా అనుష్క ఉంది.ఇక బాహుబలి లో దేవసేనగా ఒక్కసారిగా దేశం అంతా సినిమా ప్రేక్షకులని అలరించిన అనుష్క శెట్టి తరువాత బాగుమతి సినిమాతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకొని 50 కోట్ల కలెక్షన్ చేసిన మొదటి టాలీవుడ్ హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకుంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇంగ్లీష్, తెలుగు భాషలలో తెరకెక్కుతున్న సైలెన్స్ అనే సినిమాలో అనుష్క నటిస్తుంది.ఈ సినిమాలో మాధవన్ తో పాటు హాలీవుడ్ నటుడు ఓ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమా అనుష్క కెరియర్ లో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతుంది.ప్రస్తుతం అమెరికాలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం అనుష్క మరో లేడీ ఓరియంటెడ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.స్పానిష్ జూలియాస్ ఐస్ పేరుతో రిలీజ్ అయిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని కబీర్ లాల్ తెలుగు, తమిళంలో తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు.

లేడీ ఓరియంటెడ్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకి తాజాగా దేవసేన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube