ట్రంప్ ఫెయిల్యూర్ స్టొరీ...న్యూయార్క్ టైమ్స్ కధనం..!!!

అమెరికా అధ్యక్షుడు, ప్రముఖ వ్యాపారవేత్త అయిన డోనాల్డ్ ట్రంప్ గతంలో ఓ బడా వ్యాపారవేత్త అనే విషయం అందరికి తెలిసిందే.తన వ్యాపార సామ్రాజ్యాన్ని అమెరికా వ్యాప్తంగా విస్తరించాడు.అయితే 1980 నుంచి 1990 ల మధ్య కాలంలో వ్యాపార నిర్వహణలో పట్టుకోల్పోయిన ట్రంప్ ఆ సమయంలో దాదాపు 1 బిలియన్‌ డాలర్లు అంటే దాదాపు రూ.6,967 కోట్లు నష్టపోయారట.ఈ విషయాన్నే న్యూయార్క్ టైమ్స్ ఓ కధనాన్ని ప్రచురించింది.

 Trump Failure Story-TeluguStop.com

న్యూయార్క్‌ టైమ్స్‌ వెల్లడించింన వివరాల ప్రకారం.అందులో 1985లో కాసినోస్‌, హోటల్‌,అపార్ట్‌మెంట్‌ రిటైల్‌ బిల్డింగ్స్‌ ద్వారా ట్రంప్ సుమారు 46.1 మిలియన్ డాలర్లు నష్టపోయారు.ఈ క్రమంలోనే 1994లో 1.17 బిలియన్‌ డాలర్లు నష్టపోయారు అంటూ వివరాలతో ప్రచురించింది.వ్యాపారంలో వచ్చిన భారీ నష్టాలని చవిచూసినందుకే 1987లో ట్రంప్ పన్ను ఎగవేతకి పాల్పడ్డాడని ఐఆర్‌ఎస్‌ ట్రాన్స్‌క్రిప్ట్స్‌ పేర్కొంది.

ట్రంప్ ఫెయిల్యూర్ స్టొరీన్య

2016 అక్టోబర్ లో న్యూయార్క్ టైమ్స్ మీడియా సంస్థ 1995లో ట్రంప్‌ టాక్స్‌రిటర్న్స్‌కు సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించింది.ఆ ఏడాదిలో ట్రంప్‌ 916 మిలియన్‌ డాలర్లు నష్టపోయినట్టుగా ఐఆర్‌ఎస్‌ ట్రాన్స్‌క్రిప్ట్స్‌ తన నివేదికలో తెలిపింది.1990 లో ట్రంప్‌ 250మిలియన్ డాలర్లు నష్టపోయారు.అదే సంవత్సరం ట్రంప్ తాజ్మహల్ హోటల్‌, కాసినోలను ప్రారంభించారు.వీటిని నిర్వహించడంలో కూడా ఫెయిల్ అయినందుకు ఆయన దాదాపు 800 మిలియన్‌ డాలర్లు నష్టపోయినట్టు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube