కొత్త ఆవిష్కరణ : రాబోయే 20 ఏళ్లలో కేబుల్‌, డీటీహెచ్‌లు కనుమరుగు, ఇండియాలో ఆరంభం

ప్రపంచం టెక్నాలజీ వెనుక పరుగులు తీస్తూ ఉంది.20 ఏళ్లలో సంచలన మార్పులు ప్రపంచంలో నమోదు అయ్యాయి.కొన్ని సంవత్సరాల ముందు వరకు టీవీలు అంటే బ్లాక్‌ అండ్‌ వైట్‌ లో ఉండేవి.అంతకు ముందు అవి కూడా లేకపోయేవి.కాని ఈ 20 ఏళ్లలో టీవీల్లో ఎన్ని రకాలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ 20 ఏళ్లలో ఎన్ని కొత్త ఛానల్స్‌ వచ్చాయి, టెలివిజన్‌ రంగంలో ఎన్ని విప్లవాత్మక మార్పులు వచ్చాయి అనే విషయాన్ని మనం చూస్తూనే ఉన్నాం.

 Extinct Of Cables And Dth In 20-TeluguStop.com

అద్బుతాలు ఆవిష్కారం అవుతున్న ఈ సమయంలో కొత్త టెక్నాలజీ ఒకటి ప్రపంచంలోని అభివృద్ది చెందిన దేశాల్లో సందడి చేస్తుంది.ఆ కొత్త టెక్నాలజీ పేరు ఓటిటి.

ఇది టీవీ మరియు సినిమాలను ఇంట్లో టీవీలో ప్రసారం చేసే టెక్నాలజీ.

ప్రస్తుతం మన ఇంట్లో ఉన్న టీవీలు కేబుల్‌ కలెక్షన్స్‌ లేదా ఇంటిపై పెట్టుకున్న డీటీహెచ్‌ ద్వారా నడుస్తున్నాయి.

అయితే ఓటిటి సర్వీస్‌ ద్వారా కేబుల్‌ మరియు డీటీహెచ్‌లు అవసరం లేదు.నెట్‌ ఉంటే చాలు.మనం ఏ ఛానెల్‌ చూడాలనుకుంటే ఆ ఛానల్‌, ఏ సినిమా చూడాలని భావిస్తే ఆ సినిమాను చూడవచ్చు.అద్బుతంగా పని చేస్తున్న ఈ టెక్నాలజీ ఇప్పటికే అమెరికా వంటి దేశాల్లో అమలు చేస్తున్నారు.

అయితే మన దేశంలో ఇంటర్నెట్‌ వాడకం ఇప్పుడిప్పుడే ప్రారంభం అయ్యింది.ఇంకా స్మార్ట్‌ టీవీలు కూడా ఎక్కువ లేవు.

అయినా కూడా ఇండియాలో ఈ బిజినెస్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ముంబయి మరియు ఢిల్లీ వంటి ప్రధాన నగరాలోల ఈ సర్వీస్‌ మొదలైంది.

అయితే ఆధరణ మాత్రం అంతంత మాత్రంగానే ఉంది.ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సర్వీస్‌ను మొదలు పెట్టేందుకు సిద్దం అయ్యారు.

నిమ్మగడ్డ ప్రసాద్‌, అల్లు అరవింద్‌ మరియు మై హోస్ట్‌ అధినేత రామేశ్వరరావులు ఈ భారీ వ్యాపారంను ప్రారంభిస్తున్నారు.హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఆఫీస్‌ ప్రారంభించారు.

అతి త్వరలోనే హైదరాబాద్‌లో ఓటిటి సేవలను ప్రారంభించబోతున్నట్లుగా వారు చెబుతున్నారు.రాబోయే 20 ఏళ్లలో ఖచ్చితంగా కేబుల్‌ మరియు డీటీహెచ్‌లు సగానికి పడిపోతాయి అనేది మార్కెట్‌ విశ్లేషకుల అంచనా.

అందుకే ఇప్పుడే ఈ బిజినెస్‌ను ప్రారంభించడం వల్ల భవిష్యత్తులో మంచి లాభాలు దక్కుతాయని వీరు భావిస్తున్నారు.దాదాపు 200 కోట్ల పెట్టుబడితో ఈ జాయింట్‌ వెంచర్‌ను ప్రారంభిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇంటర్నెట్‌ ద్వారా టీవీ సేవలను అందించడమే ఓటిటి.ఇది ఇండియాలో భవిష్యత్తులో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube