అమెరికాలో మొట్టమొదటి మహిళ బాక్సర్ గా అమెరికాకి ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చిన ఫ్రీదా ఫోర్మన్ హటాత్తుగా మృతి చెందారు.రెండు సార్లు ప్రపంచ హెలీవెయిట్ బాక్సింగ్ ఛాంపియన్, ప్రముఖ రచయిత, రాజకీయవేత్త అయిన జార్జ్ ఫోర్మన్ కూతురే ఈ ఫ్రీదా ఫోర్మన్.
అయితే ఆమెని పలకరించాలని ఆమె ఇంటికి వచ్చిన కుటుంభ సభ్యులకి ఆమె మృత దేహం కనిపించడంతో షాక్ కి గురయ్యారు.ఆమె ఎందుకు, ఎలా మరణించిందో ఇంకా తెలియరాలేదు.
కానీ ఈ మృతిపై దర్యాప్తు చేసిన పోలీసులు మాత్రం ఇది హత్య కాదనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.
ఇదిలాఉంటే 42 ఏళ్ల ఫ్రీదా 2000 సంవత్సరం నుంచి 2001 వరకు బాక్సర్‌గా ఎన్నో సంచలనాలు సృష్టించింది.తన ఏడాది బాక్సింగ్ కెరీర్లో సాధించిన 5 విజయాల్లో 3 నాకౌట్లు నమోదు చేసింది.ఒకే ఒక్కసారి ఓటమి చెందింది.
జార్జ్ ఫోర్మన్ కు ఉన్న పిల్లల్లో ఫ్రీదా ఒకరు.